»   »  పెద్ద దర్శకుడిపై కాపీ కేసు

పెద్ద దర్శకుడిపై కాపీ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Steven Spielberg
స్టీవెన్ స్పీల్ బర్గ్ స్ధాపించిన డ్రీమ్ వర్క్స్ కంపెనీ ఇప్పుడు కాపీరైట్స్ వివాదంలో చిక్కుకుంది. వారు నిర్మించిన డిస్ట్రబియా (Disturbia) సినిమా 1954 లో హిచ్ కాక్ రూపొందించిన రియర్ విండో సినిమాకు కాపీ అని యు.ఎస్ కోర్టులో కేసు వేసారు. భాక్సాఫీస్ దగ్గర దాదాపు 80 మిలియన్లు కి పైగా సంతృప్తికరమైన వసూళ్ళు సంపాదించిన ఈ Disturbia సినిమా ద్వారా స్పీల్ బర్గ్ కాపీ రైట్స్ ని అతిక్రమించారని వారి వాదన. ఈ కేసుని షెల్డెన్ అబెండ్ రివొకరబుల్ ట్రస్ట్ వారు రెండు కాన్సెప్టు లు సిమిలారిటీ చూపుతూ వేసారు. ఈ కథలో ప్రధాన పాత్ర కదలలేని స్ధితిలో ఒక ఫిక్స్ డ్ వ్యూ పాయింట్ నుంచి ఓ హత్యను చూస్తుంది. అక్కడనుండీ కథ వేడెక్కుతుంది. దాన్ని బయిట పెట్టే క్రమంలో జరిగే కథనం ఆసక్తిగా ఉంటుంది. ఇక హిచ్ కాక్ అప్పట్లో Cornell Woolrich అన వ్యక్తి రాసిన చిన్న కథని కొని సినిమా చేసారు. ఈ గొడవతో మొదటసారి స్పీల్ బర్గ్ కాపీ రైట్స్ కేసులో దోషిగా నిలబడాల్సి రావటం అందరినీ విస్మయపరిచింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X