For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భయపడాల్సిన పని లేదు.. నేను మీకు భరోసా ఇస్తున్నా: నందమూరి బాలకృష్ణ

  |

  కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. గతంలో ఎన్నడూ కానీవినీ ఎరుగని దుస్థితిని ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. కారోనా విజృంభణకు కళ్లెం వేసేందుకు అడుగడుగునా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో డాక్టర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లకు భరోసా ఇస్తూ నందమూరి బాలకృష్ణ లేఖ రాశారు. వివరాల్లోకి పోతే..

  కరోనా విలయతాండవం.. జనం గజగజ

  కరోనా విలయతాండవం.. జనం గజగజ

  చైనాలో పుట్టి పలు దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం విలయతాండవం చేస్తోంది. ప్రపంచ జనాభాను గజ గాజా వణికిస్తోంది. కరోనా దెబ్బకు బస్సులు, రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రజాజీవనం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు గతంలో ఎన్నడూ ఎవ్వరూ చూసి ఉండరు.

   నందమూరి నటసింహం భరోసా..

  నందమూరి నటసింహం భరోసా..

  కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించగా.. వైద్యబృందాలు రేయింబవళ్లు కష్టపడుతూ కరోనాను తరిమికొట్టేందుకు ఫైట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయాన్ని నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తావిస్తూ వారికి భరోసా ఇచ్చారు.

  భయపడాల్సిన అవసరం లేదు.. అండగా ఉంటాం

  భయపడాల్సిన అవసరం లేదు.. అండగా ఉంటాం

  హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ అయిన నందమూరి బాలకృష్ణ.. ఆ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు, మేనేజ్‌మెంట్‌కి ఓ లేఖ రాశారు. వైద్య సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి హాస్పిటల్ మేనేజ్‌మెంట్ అండగా నిలుస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

  ప్రాణాపాయ స్థితి.. ఈ క్లిష్ట సమయంలో!

  ప్రాణాపాయ స్థితి.. ఈ క్లిష్ట సమయంలో!

  ఇంతకు ముందు ప్రపంచం ఇటువంటి కల్లోల పరిస్థితిని ఎన్నడూ చూడలేదని, కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కాబట్టి.. ఈ క్లిష్ట సమయంలో మనమందరం బాధ్యతయుతమైన పౌరులుగా అందరూ మెలగాలని బాలకృష్ణ అన్నారు. మన బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌‌లో పనిచేస్తున్న వైద్యులు అవిశ్రాంతంగా పని చేస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నారని ఆయన తెలిపారు.

  NBK 106 : Reason Behind Nandamuri Balakrishna New Look
  ఆసుపత్రిదే బాధ్యత..

  ఆసుపత్రిదే బాధ్యత..

  వైద్యో నారాయణో హరి: అనే సూక్తిని నిజం చేస్తూ విధులు నిర్వహిస్తున్న డాక్టర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని బాలకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. మనమంతా ఒక పెద్ద కుటుంబం, మీరు చేస్తున్న ఈ సేవలు వెలకట్టలేనివి.. ఈ సమయంలో నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఈ కరోనా మహమ్మారిపై పోరాటంలో దురదృష్టవశాత్తు మీలో ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు బయటపడినా లేదా ఈ వ్యాధి బారిన పడినా, మీ చికిత్స కోసం ఆసుపత్రి అన్ని జాగ్రత్తలు, బాధ్యత తీసుకుంటుంది అని బాలయ్య తెలిపారు.

  English summary
  During Corona Effect world wide doctors putting their efforts. Now Nandamuri Balakrishna reacted on this issue and wrote a letter to Basavatarakam Hospital doctors.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X