»   » గుడిలోకి షూతో సల్మాన్, షారుక్.... కోర్టుకెక్కిన మరో వివాదం!

గుడిలోకి షూతో సల్మాన్, షారుక్.... కోర్టుకెక్కిన మరో వివాదం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి వీరిద్దరూ వివాదంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.

కలర్స్ ఛానెల్‌లో రియాలిటీ షో బిగ్‌బాస్ కార్యక్రమం ప్రమోషం కోసం బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ కాళీ మందిరంలోకి షూ వేసుకుని వెళ్లడంపై రగడ మొదలైంది. హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్‌ను మీరట్ కోర్టు విచారణకు స్వీకరించింది. కలర్స్ టీవీ ఛానెల్‌పైన కూడా ఈ నెల 18న విచారణ జరగనుంది.

Court accepts plea against Shah Rukh Khan, Salman Khan

2015 డిసెంబర్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ కార్యక్రమం కోసం కాళీ మందిరం సెట్ వేసి ఈ ఇద్దరు హీరోలపై షూట్ చేశారు. షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోలు షూ వేసుకుని నటించారు.

దేవాలయంలోకి షూలతో వెళ్లి హిందువుల మనోభాలను దెబ్బతీశారంటూ హిందూ మహాసభ నేత భారత్ రాజ్‌పుత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఛానెల్‌ దృష్టికి, పోలీసుల దృష్టికి ఈ విషయం తెచ్చినా స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కార్యక్రమం దర్శకుడిపై కూడా పిటిషన్ దాఖలైంది.

సల్మాన్ ఖాన్, షారుక్ మధ్య చాలా ఏళ్లుగా మాటలు లేవు.... ఈ మధ్యనే ఈ ఇద్దరి మధ్య మళ్లీ స్నేహ చిగురించింది. ప్రస్తుతం ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరి సినిమాను ఒకరు ప్రమోట్ చేస్తున్నారు. ఈ సారి ఇద్దరూ ఒకే వివాదంలో ఇరుక్కోవడం హాట్ టాపిక్ అయింది.

English summary
A local court accepted a plea by Hindu Mahasabha against Salman Khan, Shah Rukh Khan and a private TV channel for showing the actors inside a temple wearing shoes during a reality show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu