»   »  ప్రీతి జింటాకు కోర్టు జరిమానా

ప్రీతి జింటాకు కోర్టు జరిమానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి : చెక్‌ బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటి ప్రీతి జింటాకు రూ.పదివేల జరిమానాను అంధేరి మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు విధించింది. 'ఇష్క్‌ ఇన్‌ ప్యారిస్‌' చిత్రం స్క్రిప్టు రాసినందుకు అబ్బాస్‌ టైర్‌వాలాకు ప్రీతి రూ.18 లక్షల చెక్‌ ఇచ్చారు. ఆ చెక్‌ బౌన్స్‌ అవడంతో అబ్బాస్‌ అంధేరి కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఆ ఫిర్యాదును రద్దు చేయాలని ప్రీతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడమే కాకుండా కేసు విచారణకు రెండుసార్లు గైర్హాజరయ్యారు. తాజాగా విచారణను వాయిదా వేయాలని కోరడం కోర్టుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో మొత్తం రూ.పదివేలు చెల్లించాలంటూ న్యాయమూర్తి తహిల్యానీ నాలుగు వారాలపాటు విచారణను వాయిదా వేశారు.

Court fines Preity Zinta for seeking adjournment

గతంలోనూ ...చెక్‌ బౌన్సింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి ప్రీతి జింటాపై అంథేరి మెట్రోపాలియన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై నాన్‌-బెయిల బుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. వారెంట్‌ను జింటా తరఫు న్యాయవాది రత్నేశ్వర్‌ ఝా ధృవీకరిం చారు. ప్రీతి దేశంలో లేరని చెప్పినప్పటికీ మెజిస్ట్రేట్‌ ఆమెపై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేశారని న్యాయవాది అన్నారు. వారెంట్‌ను రద్దు చేయాలని తాము బాంబే హైకోర్టును ఆశ్రయిస్తామని ఝా తెలిపారు. గతేడాదిలో విడుదలైన 'ఇష్క్‌ ఇన్‌ ప్యారిస్‌' చిత్రం మాటల రచయిత అబ్బాస్‌ తైరెవాల నటిపై చెక్‌ బౌన్సింగ్‌ కేసు దాఖలు చేశాడు. ఇంతకుముందు విచారణకు నటి హాజరు కానందుకు గాను కోర్టు రూ.5వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

English summary

 A magistrate's court in suburban Andheri today imposed a cost of Rs 10,000 on the Bollywood actress Preity Zinta for seeking adjournment in the cheque bouncing case filed against her by the scriptwriter Abbas Tyrewala. Zinta also did not get any relief from the Bombay High Court, where she had sought a stay to the proceedings in the Andheri magistrate's court.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu