»   »  అమలాపాల్‌కు విడాకులు మంజూరు.. చేతిలో అర డజన్ చిత్రాలు..

అమలాపాల్‌కు విడాకులు మంజూరు.. చేతిలో అర డజన్ చిత్రాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటి అమలాపాల్‌, ఆమె భర్త దర్శకుడు విజయ్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వ్యక్తిగత విభేదాల కారణంగా వారి దాంపత్య జీవితంలో కలతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు గత కొద్దికాలంగా వేర్వేరుగా ఉంటున్నారు.

చెన్నై కోర్టు విడాకుల మంజూరు

చెన్నై కోర్టు విడాకుల మంజూరు

సినీ జంటకు చెన్నై కోర్టు విడాకుల మంజూరు
కొద్ది నెలల క్రితం అమలాపాల్ దంపతులు విడాకులు కావాలంటూ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. వీరద్దరిని కలిపేందుకు కోర్టు కౌన్సెలింగ్‌ను కూడా ఇచ్చింది. అయినా వీరిద్దరూ విడాకులకే మొగ్గు చూపడంతో మంగళవారం విడాకులు మంజూరయ్యాయి.

 2009లో మలయాళ సినీ పరిశ్రమలోకి..

2009లో మలయాళ సినీ పరిశ్రమలోకి..


2009లో నీలథమరా అనే చిత్రం ద్వారా మలయాళ సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. బెజవాడ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయయైంది. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో జెండాపై కపిరాజు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత దర్శకుడు విజయన్‌తో అమలపాల్ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. అనంతరం 2014 జూన్‌ 12న వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒక్కటైన విషయం తెలిసిందే.

 దాంపత్య జీవితంలో కలతలు ఇలా

దాంపత్య జీవితంలో కలతలు ఇలా


పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్న అత్తింటి వారి నిబంధనను అమల పాటించకపోవడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ జంట వివాహమైన కొంత కాలానికే విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించింది.

 చేతిలో అరడజన్ సినిమా ఆఫర్లు

చేతిలో అరడజన్ సినిమా ఆఫర్లు


వివాహ బంధానికి దూరమైన తర్వాత ఈ ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. అమల చేతిలో ఇప్పటికే అరడజను ఆఫర్లు ఉండగా.. విజయ్‌ కూడా రెండు సినిమాలను డైరెక్ట్‌ చేస్తున్నాడు. తాజా విడాకుల నేపథ్యంలో మరో సినీ జంట దాంపత్య జీవితం మధ్యలోనే విఫలమైంది.

English summary
Popular actor Amala Paul and filmmaker AL Vijay married in 2014. After leading the married life for some time, both applied for divorce. The chennai court has finally granted the divorce for both of them on Tuesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu