»   »  వీడని వివాదం, కేసు: మహేష్‌బాబు, కొరటాల శివకు సమన్లు

వీడని వివాదం, కేసు: మహేష్‌బాబు, కొరటాల శివకు సమన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైద‌రాబాద్‌: మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'శ్రీమంతుడు' సినిమా కథపై వివాదం ఇంకా సెటిల్ కాలేదు. ఈ విషయంలో నటుడు మహేష్ బాబు, దర్శక నిర్మాతలు కొరటాల శివ, ఎర్నేని నవీన్ కు తాజాగా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. శ్రీమంతుడు సినిమా కథ తనదేనంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఓ వార పత్రికలో 2012లో తాను రాసిన 'చచ్చేంత ప్రేమ' నవలను అనుమతి లేకుండా సినిమా తీసి కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని.. వారిపై క్రిమినల్ చర్యలను తీసుకోవాలని కోర్టును కోరారు.

శరత్ చంద్ర ప్రైవేట్ ఫిర్యాదును ఇవాళ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణకు హాజరు కావాలని మహేష్ బాబు, కొరటాల శివ, నవీన్ లను ఆదేశించింది. ముగ్గురిపై ఐపీసీ 120బీ, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది.

Court Summons to Koratala Siva and Mahesh babu

2012 సంవత్సరంలో తాను రాసిన 'చచ్చేంత' ప్రేమ అనే నవలను ప్రఖ్యాత మాసపత్రిక 'స్వాతి' ప్రత్యేక సంచిక ద్వారా ప్రచురించిందని, ఆ నవలను వెంకట్రావ్ అనే నిర్మాత తన నుంచి కొనుక్కొన్నాడని, నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో నిర్మాత వెంకట్రావ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్న తరుణంలో 'శ్రీమంతుడు' రిలీజ్ అవ్వడం.. సూపర్ హిట్ అవ్వడం కూడా జరిగిపోయాయి.

ఈ విషయమై గత కొన్ని నెలలుగా తమిలంతోపాటు తెలుగు రచయిత సంఘాల్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదు, కొంతమంది ఇండస్ట్రీ పెద్దలను సైతం కలిసాము. ఇక వేరే దారిలేక మీడియా ముందు మా బాధను వెలిబుచ్చుకుంటున్నాము. ఏదో డబ్బులు ఆశించి మేమీ ఫిర్యాదు చేయడం లేదు.

నాలా మరో రచయితకు భవిష్యత్ తో ఇటువంటి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే మాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకొంటున్నానని రచయిత శరత్ చంద్ర తెలిపారు. ఈ విషయమై న్యాయం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని, తమ కథను కాపీ కొట్టడం విషయంలో 'శ్రీమంతుడు' దర్శకనిర్మాతల్ని సంప్రదించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం అటుంచి తమను ఎంతో నీచంగా మాటలన్నారని నిర్మాత వెంకట్రావ్ పేర్కొన్నారు!

Court Summons to Koratala Siva and Mahesh babu

ఈ చిత్రం విడుదలయ్యాక చెన్నై రచయితల సంఘం, దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాను. వారు తెలుగు సినిమా కాబట్టి.. హైదరాబాద్‌లోని అసోసియేషన్‌కు ఫిష్ట్‌ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకులు, రచయితల దృష్టికి తీసుకువచ్చాను. కానీ వారెవరూ నాకు న్యాయం చేయలేదు.

వ్యక్తిగత పనిమీద కొంతకాలం కేరళలో వుండాల్సి వచ్చింది. అందుకే ఇంతకాలం జాప్యం జరిగింది. ఇక లాభంలేక మీడియా ముందుకు రావాల్సివచ్చిందని అన్నారు. అయితే ఈ విషయమై శ్రీమంతుడు దర్శకుడు కానీ, నిర్మాతలు కానీ వివరణ ఇవ్వడానికి అందుబాటులో లేకపోవడం విశేషం.

English summary
Director Koratala Siva reached new heights after making Srimanthudu. The film starring Superstar Mahesh Babu and Shruti Haasan released in August but it is still the buzz maker in the tinsel town. Koratala Siva and Mahesh Babu have influenced many in adopting villages and contributing back to the society. But now, Koratala Siva along with Bollywood actor Mahesh Babu is stuck in legal trouble.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu