»   » క్రికెట్‌తో ఒక్కటైన జయసుధ, నితిన్.. సహజనటికి తీరని విషాదం

క్రికెట్‌తో ఒక్కటైన జయసుధ, నితిన్.. సహజనటికి తీరని విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిత్ర పరిశ్రమలో సినీనటి జయసుధ, నిర్మాత నితిన్ కపూర్‌ల దాంపత్యం దాదాపు 25 ఏండ్లకు పైగా అన్యోన్యంగా సాగింది. వారిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానప్పటికీ ఆయనతో ఎప్పటికీ కలిసి ఉండాలనేంత ప్రేమ ఉండేది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయసుధ తెలిపింది. కానీ వారి విధి మరోలా తలచింది. మంగళవారం (మార్చి 14న) నితిన్ కపూర్ ముంబైలోని తన సోదరి నివాసంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జయసుధకు, సన్నిహితులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

రెండేళ్ల పాటు ప్రేమలో..

రెండేళ్ల పాటు ప్రేమలో..

సహజనటి జయసుధకు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. మహానటిమణులను గుర్తు చేసే విధంగా ఆమె పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె భర్త నితిన్‌కపూర్‌కు కూడా హిందీ, తెలుగు పరిశ్రమల్లో మంచి గుర్తింపు ఉంది. ఇద్దరూ రెండేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

1985లో వివాహం

1985లో వివాహం

హిందీ చిత్రాల నిర్మాత అయిన నితిన్ కపూర్‌తో 1983 ప్రాంతంతో జయసుధ ప్రేమలో పడ్డారు. జయసుధకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నితిన్ కపూర్‌కూ అంతే. క్రికెట్ పట్ల ఉన్న అభిమానమే ఈ ఇద్దరినీ దగ్గరకు చేర్చింది. 1985లో నితిన్ కపూర్‌, జయసుధ వివాహమాడారు.

జయసుధకు దేవుడంటే చాలా నమ్మకం

జయసుధకు దేవుడంటే చాలా నమ్మకం


జయసుధకు దేవుడంటే చాలా నమ్మకం. 1985లో బ్యాంకాక్‌లో ఆమె ఊహించని విధంగా నీటిప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే జీసస్ అనుగ్రహం వల్లే తాను బతికి బయటపడ్డానని ఆమె నమ్ముతారు. భగవంతుని సహాయం కోరితే ఆయన ఏదో ఒకరూపంలో మనలను కాపాడతారని జయసుధ ప్రగాఢంగా విశ్వసిస్తారు. నితిన్ కపూర్ కూడా అదేవిధంగా భావిస్తారు. బహుశా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండటం కూడా వారి మధ్య గాఢమైన బంధానికి పునాది వేసిందని పలువురు చెప్తుంటారు.

 జితేంద్ర సూచన మేరకు

జితేంద్ర సూచన మేరకు


80వ దశకంలో దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు, తమిళ చిత్రాలను హిందీలోకి రీమేక్ చేస్తుండేవారు. ఆ చిత్రాల్లో ఎక్కువగా జితేంద్ర హీరోగా నటించేవారు. నితిన్ కపూర్ జితేంద్రకు సోదరుడు. సినిమాల నిర్మాణంలో దాసరికి సహకరించాలని జితేంద్ర సూచన మేరకు నితిన్‌ మద్రాసు వచ్చి అద్దె ఇంట్లో ఉన్నారు.

 జయసుధ ఇంటి పక్కనే..

జయసుధ ఇంటి పక్కనే..


జయసుధ నివాసం పక్కనే నితిన్ కపూర్ ఉండటంతో వారి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఆ క్రమంలో జయసుధ, నితిన్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఇక క్రికెట్ పట్ల ఇద్దరికీ ఉన్న అభిమానం వారిని మరింత చేరువ చేసింది. ఇద్దరి మనసులు, అభిరుచులు కలవడంతో రెండేళ్ల ప్రేమ...పెళ్లిపీటల మీదకు వారిని చేర్చింది.

తొలిచూపులోనే అభిమానం

తొలిచూపులోనే అభిమానం

'నితిన్‌ను కలిసిన మొదటి రోజునే ఆయనపై అభిమానం కలిగింది. ఆయన చూపులు నన్ను కట్టిపడేసేవి. నాతో మాట్లాడుతున్నట్టే ఉండేవి. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాకపోవచ్చు. అయితే ఆయనతో ఎప్పటికీ కలిసి ఉండాలని అనిపించేది' అని ఓ ఇంటర్వ్యూలో నితిన్‌పై ఉన్న ప్రేమను జయసుధ వ్యక్తం చేశారు.

జయసుధ అంటే నితిన్‌కు..

జయసుధ అంటే నితిన్‌కు..

నితిన్‌కు కూడా జయసుధపై అంతే మొత్తంలో ప్రేమ ఉండేది. తాము మంచి మిత్రులమని, ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించే కాలంలోనే తమ మధ్య ప్రేమకు అంకురార్పణ జరిగింది. ఒకరిని మరోకరు చూడకుంటే ఉండలేమనే భావన కలిగేది అని ఇటీవల నితిన్ వెల్లడించారు.

జయసుధగా మారిన సుజాత

జయసుధగా మారిన సుజాత

జయసుధ తల్లి కూడా ఓ నటి. నటి విజయనిర్మల జయసుధకు మేనత్త. అప్పటి జయసుధ పేరు సుజాత. తొలిసారిగా 'పండంటికాపురం' చిత్రంలో జమున కుమార్తెగా సుజాత నటించింది. ఆ తర్వాత కే బాలచందర్ ఆమె ప్రతిభను గుర్తించి తమిళంలో అవకాశమిచ్చారు. అప్పటికే సుజాత పేరుతో ఒక నటి ఉండటంతో ఆమె పేరును జయసుధగా బాలచందర్ మార్చారు.

English summary
Jayasudha, Nitin Kapoor relation is not love at first sight. but their wedding relation is strong. Unfortunately Nitin Kapoor committed suicide in Mumbai on march 14.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu