twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్‌లో వ్యక్తి ఆత్మహత్య.. పూజా హెగ్డేకు పోలీసుల నోటీసులు

    |

    క్యూనెట్ కేసు.. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన వ్యవహారాల్లో ఇది ఒకటి. తక్కువ డబ్బులు కడితే ఎక్కువ వస్తాయని చెప్పి మోసాలకు పాల్పడే వాళ్ల గురించి మనకు తెలుసు. ఈ కేసులో కూడా అలాగే చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేసి కోట్లు సంపాదించారు. అయితే, వాటిని తిరిగి ఇవ్వకుండా జెండా ఎత్తేసింది సదరు సంస్థ. దీంతో ఈ మోసం బయటకు వచ్చింది. అంతేకాదు, ఈ కేసులో పలువురు సెలెబ్రిట్రీలు కూడా పరోక్షంగా భాగమవడం అప్పట్లో సంచలనం అయింది. తాజాగా ఇది మరోసారి తెరపైకి వచ్చింది.

    దేశ వ్యాప్తంగా బాధితులు

    దేశ వ్యాప్తంగా బాధితులు

    ఈ సంస్థ దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందిని మోసం చేసింది. ఐటీ కారిడార్లైన ముంబై, బెంగళూర్, నోయిడా, అహ్మదాబాద్ లాంటి అనేక నగరాల్లో క్యూనెట్ సంస్థ కోట్లు వసూలు చేసింది. యువత, ఉద్యోగులే టార్గెట్‌గా వారి వద్ద దాదాపు రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగింది.

    నటీనటులపై ఫిర్యాదు

    నటీనటులపై ఫిర్యాదు

    తమకు ఇష్టమైన సినీ నటులు యాడ్స్ చేయడం వల్ల ఈ సంస్థ పరిచయం చేసిన ప్లాన్లకు తాము ఆకర్షితులం అయ్యామని, ఇప్పుడు వీళ్లు మోసం చేయడంతో సదరు నటులపైనా చర్యలు తీసుకోవాలని కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    సెలెబ్రిటీలకూ నోటీసులు

    సెలెబ్రిటీలకూ నోటీసులు

    ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు 70 మందిని అరెస్ట్ చేసి, 30 కేసులు నమోదు చేశారు. అలాగే, 500 మంది ప్రముఖులకు నోటీసులు పంపగా.. షారుఖ్, బొమన్ ఇరానీ, అనిల్ కపూర్ తమ లాయర్ల ద్వారా సమాధానమిచ్చారు. మిగిలిన వారు ఎవరూ దీనిపై స్పందించలేదు. ఇందులో తెలుగులో బిజీగా ఉన్న పూజా హెగ్డే, అల్లు శిరీష్ పేరు కూడా బయటకు వచ్చింది.

    మరో బాధితుడి ఆత్మహత్య

    మరో బాధితుడి ఆత్మహత్య

    ఈ కుంభకోణం వల్ల నష్ట పోయిన ఓ ఐటీ ఉద్యోగి రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సైబరాబాద్ పోలీసులు మరోసారి ఈ కేసుపై దృష్టి సారించారు. అమాయకులను మోసం చేసిన వారిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

    మరోసారి నోటీసులు

    మరోసారి నోటీసులు

    గతంలో ఈ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా వ్యవహరించిన వారికి గతంలో నోటీసులు పంపారు సైబరాబాద్ పోలీసులు. వారిలో కొందరు మినహాయిస్తే మిగిలి సెలెబ్రిటీల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో వాళ్లందరికీ మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో పూజాహెగ్డే పేరు కూడా ఉందని సమాచారం. అల్లు శిరీష్ విషయం తెలియాల్సి ఉంది.

    English summary
    Continuing to crack the whip against agents of controversial multi-level marketing (MLM) companies, the Cyberabad City Police has arrested 58 independent representatives (IRs) of QNet for their involvement in 14 cases of fraud and cheating worth Rs1,000 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X