»   » కొరత తీర్చేందుకు కృషి : డి. సురేష్‌ బాబు

కొరత తీర్చేందుకు కృషి : డి. సురేష్‌ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : సినిమా రంగంలో ఉన్న సాంకేతిక నిపుణుల కొరతను తీర్చేందుకు ఆధునిక సాంకేతిక సహాయంతో మెరుగైన శిక్షణనిస్తున్నట్లు రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌ ఛైర్మన్‌ దగ్గుపాటి సురేష్‌బాబు అన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏ వర్సిటీతో జరిగిన అవగాహనా ఒప్పంద (ఎంఓయూ) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సురేష్‌బాబు మాట్లాడుతూ... సినిమా, టీవీ రంగాల్లో ఉన్న నిపుణుల కొరతను తీర్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా జేఎన్‌ఎఎఫ్‌ఎ వర్శిటీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు వివరించారు. మాస్టర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ, యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్టుల్లో విద్యార్థులకు మెరుగైన శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. సినిమా, టీవీ దర్శకత్వం, స్క్రీన్‌ రైటింగ్‌, ఫిల్మ్‌టీవీ సినిమాటోగ్రఫీలలో మాస్టర్స్‌ డిగ్రీలతోపాటు పలు షార్ట్‌టర్మ్‌, డిప్లొమా కోర్సుల్ని తమ సంస్థ అందిస్తున్నట్లు తెలిపారు.

వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి డా.పేర్వారం పద్మావతి మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్‌ అవసరాలకు తగ్గట్లు వివిధ కోర్సుల్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిష్ట్రార్‌ కవితా దరియానిరావు, అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ప్రదీప్‌కుమార్‌, అడ్మిషన్ల డైరెక్టర్‌ ఎస్‌.కుమార్‌, ఆర్‌ఎఫ్‌ఎస్‌ డీన్‌ వెంకటేష్‌ చక్రవర్తి, శ్రీనివాస్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

English summary
Ramanaidu Film School is a long cherished dream of SURESH PRODUCTIONS, which with its decades of experience & know-how will soon be celebrating its golden jubilee in 2014.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu