»   » సెక్స్ కామెడీ మూవీ: సిగ్గెందుకు అంటున్న సన్నీ లియోన్!

సెక్స్ కామెడీ మూవీ: సిగ్గెందుకు అంటున్న సన్నీ లియోన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పోర్న్ సినిమాల్లో నటించే భామను తీసుకొచ్చి మామూలు సినిమాల్లో నటింపచేస్తే వ్యవహారం ఇలానే ఉంటుంది. ఇంతకీ అసలు విషయంలోకి వెళితే.... సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘కుచ్ కుచ్ లోచా హై'లో నటిస్తోంది. ఇదో సెక్సీ కామెడీ చిత్రం. శృంగార సీన్ల తీవ్రత, డైలాగుల ఘాటు కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ఇలాంటి సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడటానికి అంతగా ఇష్టపడరు భారతీయులు.

అయితే దీనిపై సన్నీ లియెన్ తనదైన వాదన వినిపిస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ పొందిన సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. అవి చట్టపరంగా అనుమతి ఉన్న సినిమాలే అంటోంది. ‘కుచ్‌ కుచ్‌ లోచా హై' మూవీ ఒక సెక్స్ కామెడీ మూవీ, కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా అంటూ ప్రమోట్ చేస్తోంది.

 Daaru Peeke Dance Song Teaser - Kuch Kuch Locha Hai

మరో వైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్న మీడియాపైనా తనదైన రీతిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది సన్నీ లియోన్. సినిమాల్లో రకరకాలు ఉంటాయి. లవ్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, శృంగార భరిత చిత్రాలు ఉన్నట్లే రొమాంటిక్ సీన్ సన్నివేశాలతో కామెడీ పంచే సెక్సా కామెడీ మూవీ ఇది. సెన్సార్ నిబంధనల ప్రకారమే సినిమా ఉంటుంది. ఇలా సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడం సరికాదు అంటోంది.

పోర్న్ సినిమాల్లో నటించే భామను తీసుకొచ్చి మామూలు సినిమాల్లో నటింపచేస్తే వ్యవహారం ఇలానే ఉంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట ట్రైలర్ కూడా విడుదల చేసారు. ఈ చిత్రానికి దేవాంగ్ ధోలకియా దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ లియోన్, రామ్ కపూర్, ఎవలీన్ శర్మ, నవదీప్ చాబ్రా, సుచిత్ర త్రివేది ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Watch the latest teaser of Daaru Peeke Dance from Kuch Kuch Locha Hai. Starring Sunny Leone.
Please Wait while comments are loading...