»   » థియేటర్ గార్డు ప్రాణం తీసిన సూపర్ హిట్ సినిమా

థియేటర్ గార్డు ప్రాణం తీసిన సూపర్ హిట్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్ రీసెంట్ సినిమా 'దబాంగ్' సూపర్ హిట్టయిందనే సంగతి తెలిసిందే. దాంతో బిలాస్ పూర్ (ఛత్తీస్ ఘడ్) లో ప్రేక్షకులను అదుపుచేయాటానికి ఓ ధియోటర్ లో గార్డుని పెట్టారు. అయితే ఆ సినిమా ఆ థియేటర్ సెక్యురిటీ గార్డు ప్రాణాలు తీసింది. టికెట్ల కోసం జనాలు ఎగబడ్డంతో, అందులో మఫ్టీలో ఉన్న ఎస్ ‌పీని తెలియక సెక్యురిటీ గార్డు తోసేశాడు. దీన్ని చూసిన పోలీస్ కానిస్టేబుళ్లు ఆ గార్డును చితకబాదడంతో యాదవ్ అనే సెక్యురిటీ గార్డు అక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో సంఘటనా స్థలంలో ఉన్న సెక్యురిటీ గార్డు సంస్థ యజమాని పోలీసులే అతణ్ణి చంపారని తొలుత చెప్పినా...ఇది పోలీసుల వ్యవహారమని తెలియడంతో మాట మార్చాడు, తనకేమీ తెలియదని వెనక్కు తగ్గాడు. పోలీసులు ఆ కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. టిక్కెట్లు కొంటుండగా ఈ గొడవ జరిగిందని కేసును నమోదు చేసుకున్నారు. ఇక దబాంగ్ సినిమా కూడా ఓ కరప్టడ్ పోలీస్ అధికారి కథ కావటం విశేషం

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu