»   » దగ్గరగా...దూరంగా(ప్రివ్యూ)

దగ్గరగా...దూరంగా(ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్యాచులర్స్, సామాన్యుడు వంటి హిట్స్ సినిమాలను అందించిన రవిచావలి తాజాచిత్రందగ్గరగా... దూరంగా. ఈరోజు విడుదల అవుతున్నఈ చిత్రంలో సుమంత్ హీరోగాచేసాడు. ఓ గమ్మత్తైన ప్రేమకధగాఈచిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. కథ ప్రకారం ఓయాడ్ఏజన్సీలో గౌతమ్‌(సుమంత్‌) పనిచేస్తుంటాడు.హై మిడిల్ క్లాస్ కి చెందిన అమ్మాయిమీనాక్షి అలియాస్‌ కామాక్షి(వేదిక). ఓ అనుకోని సంఘటనతో వీళ్లిద్దరూ ప్రేమలోపడతారు. ఆ తరవాత సాధారణ యువకుడైన గౌతమ్‌ కొన్ని అసాధారణ పరిస్థితుల్నిఎదుర్కోవలసివస్తుంది. వీరి ప్రేమకథ ఏ తీరానికి చేరిందీ అనేది అసలు కథ. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఉత్కంఠగా సాగే ప్రేమకథ ఇది. భిన్నమైన రీతిలో కథ, కథనాలు సాగుతాయి. సుమంత్‌ నటన ప్రధానబలం. క్లైమాక్స్ సీన్స్ కథకు ప్రాణమై నిలుస్తాయి. అవి సినిమాకు ఎంతోకీలకమైనవిఅన్నారు.

దగ్గరగా...దూరంగా
సంస్థ:సుధాసినిమా
నటీనటులు: సుమంత్‌, వేదిక, బ్రహ్మానందం, రఘుబాబు, ఆహుతిప్రసాద్‌, కృష్ణభగవాన్‌, సత్యంరాజేష్‌, అజయ్‌ తదితరులు
సంగీతం:రఘుకుంచె
నిర్మాత:జె.సాంబశివరావు
దర్శకత్వం:చావలిరవికుమార్‌
విడుదల:శుక్రవారం.

English summary
Sumanth’s Daggaraga Dooramga releasing today. Vedhika is playing the lead role opposite Sumanth in this film. Ravikumar Chavali has directed the film and J Sambasiva Rao produced it on Sudha Cinema banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu