»   » అందుకే ఎన్టీఆర్‌ ప్రసంగాల్నీ చూశా: 'లీడర్' హీరో రాణా

అందుకే ఎన్టీఆర్‌ ప్రసంగాల్నీ చూశా: 'లీడర్' హీరో రాణా

Posted By:
Subscribe to Filmibeat Telugu

భావోద్వేగంతో, గంభీరంగా మాట్లాడే ఎన్టీఆర్‌ ప్రసంగాల్నీ చూశాను. నవతరం రాజకీయ నాయకుల బాడీ లాంగ్వేజ్‌, వస్త్రధారణ కోసం రాహుల్‌ గాంధీ, మిలింద్‌ దేవ్‌రా, సచిన్‌ పైలెట్‌ లాంటివాళ్ల శైలిని పరిశీలించాను. అయితే ఎవరి ప్రభావంతోనో ఈ పాత్రలో జీవించలేద..అంటున్నారు హీరో దగ్గుపాటి రాణా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రెడీ అయి ఈ నెల(పిభ్రవరి)19న వస్తున్న చిత్రం లీడర్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. పాత్రకోసం ప్రత్యేకమైన శిక్షణ పొందలేదంటూనే...నటనలో శిక్షణ పొందేటప్పుడు చెబుతారు... క్యారెక్టర్‌ స్టడీ అని. దాని ప్రకారం పలువురు రాజకీయ నాయకుల ప్రసంగాల తాలూకు వీడియో క్లిప్స్‌ చూశాను. అందులో అమెరికా అధ్యక్షుడిగా చేసిన జాన్‌ ఎఫ్‌ కెన్నడీకి సంబంధించినవీ ఉన్నాయన్నారు.

అలాగే లీడర్ చిత్రం ఎలా ఉండబోతోందో చెబుతూ...ఈ చిత్రంలో నాయకుడికీ... రాజకీయ నాయకుడికీ ఉండే వ్యత్యాసాన్ని చూపిస్తాం. నాయకుడనేవాడికి దూరదృష్టితోపాటు అందరూ నా వాళ్లే అనే సమదృష్టి, నిజాయతీ ఉండాలి. తను నమ్మినదానికి కట్టుబడి ఉండాలనే వాస్తవాన్ని చూపిస్తున్నాం. ప్రజలు కూడా అలాంటి నాయకుడే కావాలనుకొంటున్నారు. రాజకీయ శూన్యత కాదు... నాయకత్వ శూన్యత ఉందనే కథ ఇది.అలాగే ఈ చిత్రం సవాళ్లు, ప్రతిసవాళ్లు, పగ, ప్రతీకారాలతో కూడిన యాక్షన్‌ అంశాలుకు భిన్నంగా ఉంటుందీ సినిమా. రక్తపు బొట్టు అనేది కనిపించదు. పేజీల కొద్దీ సంభాషణల్లాంటివి వినిపించవు. వాస్తవిక దృక్పథంతో సాగుతుందీ సినిమా అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu