»   » హీరో సామర్థ్యమేంటో అతని రెండో సినిమా చూస్తే తెలిసిపోతుంది...!?

హీరో సామర్థ్యమేంటో అతని రెండో సినిమా చూస్తే తెలిసిపోతుంది...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా నటించిన తొలి చిత్రం 'లీడర్' రిలీజ్ అయి ఏడాది దాటినా, అతని రెండో సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. తన ద్వితీయ చిత్రంగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'నేను-నా రాక్షసి' చిత్రాన్ని రాణా చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇండస్ట్రీ సమ్మె వంటి రకరకాల కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెల మూడోవారంలో ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ 4న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇక, రాణా కెరీర్ కి ఈ సినిమా ఏ విధంగా ఉపయోగపడుతుందీ అన్న దానిపైనే ప్రస్తుతం టాలీవుడ్ లో డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే, రాణా తన తొలి చిత్రంలో సోబర్ క్యారెక్టర్ పోషించాడు. ఇప్పుడీ సినిమాలో యాక్షన్ హీరోగా కనిపిస్తాడు. ఈ తరహా పాత్రలో అతన్ని సమర్ధవంతంగా ప్రోజక్ట్ చేయడంలో దర్శకుడు ఎంతవరకు సక్సెస్ అయ్యాడన్నది సినిమా చూస్తేనే కానీ చెప్పలేం. రాణా మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నాడు. ఇందులో ఇలియానా హీరోయిన్ గా నటించగా, అభిమన్యు సింగ్ ('రక్త చరిత్ర'లో బుక్కారెడ్డి గా నటించాడు) మెయిన్ విలన్ గా నటించాడు. ఇక, పూరీ ఫేవరైట్ ముమైత్ ఖాన్ లేడీ విలన్ గా సెకండాఫ్ లో వస్తుంది. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా హైదరాబాద్, యూరప్ లలో జరిగితే, సెకండాఫ్ థాయ్ ల్యాండ్ లో జరుగుతుందట. ఏది ఏమైనా, సినిమా లేట్ అయ్యే కొద్దీ ప్రేక్షకులలో క్రేజ్ మాత్రం పోతుంది!

English summary
'Nenu Naa Rakshasi' film releasing on 4th April 2011. 'Nenu Naa Rakshasi' has completed its dubbing part. Pappi Lahiri, Vishwa and Vishal-Sekhar composed music will release soon. Hero Rana playing an assassin role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu