For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Drushyam 2 Twitter Review: వెంకటేష్ ఖాతాలో మరొకటి.. సినిమాలో ప్లస్ మైనస్ ఇవే.. ఆ పొరపాటు లేకుంటే!

  |

  టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనలోని టాలెంట్లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు దగ్గుబాటి వెంకటేష్. విక్టరీనే ఇంటి పేరు పెట్టుకునేంతగా విజయాలను అందుకున్న ఆయన.. కొంత కాలం పాటు ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. అయితే, ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడీ సీనియర్ హీరో. 'గురు', 'F2', 'వెంకీ మామ', 'నారప్ప' వంటి హిట్లను అందుకుని.. ఇప్పుడు 'దృశ్యం2' అనే సినిమాలో నటించాడు. తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ సినిమాపై ట్విట్టర్ వేదికగా ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం పదండి!

  ‘దృశ్యం 2'తో వచ్చేసిన వెంకటేష్

  ‘దృశ్యం 2'తో వచ్చేసిన వెంకటేష్

  వరుస విజయాలతో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రమే ‘దృశ్యం 2'. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ, రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు. మీనా హీరోయిన్‌గా నటించగా.. కృతిక, ఎస్తర్ అనిల్, నదియా, సంపత్, నరేష్, తణికెళ్ల భరణిలు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

  హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ పరమేశ్వరన్: అమాంతం పైకి లేపి రచ్చ చేసిన హీరోయిన్

  అందులో సక్సెస్‌‌.. భారీ అంచనాలు

  అందులో సక్సెస్‌‌.. భారీ అంచనాలు

  2014లో వచ్చిన ‘దృశ్యం'కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే ‘దృశ్యం 2'. దీన్ని కొద్ది రోజుల క్రితమే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కించారు. అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు దీన్నే తెలుగులో వెంకటేష్ హీరోగా రూపొందించారు. అక్కడ సక్సెస్ అవడంతో తెలుగులోనూ దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో అమెజాన్ ఈ మూవీ హక్కులు తీసుకుంది.

  ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చి

  ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చి

  ఎన్నో అంచనాల నడుమ రూపొందిన ‘దృశ్యం 2' మూవీని నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీన్ని నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 24 రాత్రి నుంచి ఇది స్ట్రీమింగ్ అయింది. దీంతో ఈ సినిమాను వెంకీ మామ అభిమానులు ఒకరోజు ముందే చూసేశారు.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  ‘దృశ్యం 2'కు అనుకున్న విధంగా

  ‘దృశ్యం 2'కు అనుకున్న విధంగా

  వెంకటేష్ నటించిన ‘దృశ్యం 2' మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో క్లోజ్ అయిన కేసును రీఓపెన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని నుంచి రాంబాబు ఎలా తప్పించుకున్నాడు? ఈ కేసు వల్ల రాంబాబు ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? అనే అంశాలతో వచ్చిన ఈ మూవీకి అనుకున్న విధంగానే మంచి టాక్ వచ్చింది.

  ఫస్టాఫ్ ఇలా సెకెండాఫ్ అలా ఉంది

  ఫస్టాఫ్ ఇలా సెకెండాఫ్ అలా ఉంది

  వరుణ్‌ను రాంబాబు హత్య చేసిన తర్వాత థియేటర్ యజమాని అవ్వడం.. ఓ సినిమాను నిర్మించాలనుకోవడం వంటి అంశాలతో సినిమా మొదలవుతుంది. అయితే, కేసును రీఓపెన్ చేయడంతో కథలో వేగం పెరుగుతుంది. ఆ తర్వాత ఎన్నో ట్విస్టులతో ఆసక్తికరంగా మారుతుంది. మొత్తంగా ఫస్టాఫ్ కొంత సాగదీసినట్లుగా ఉన్నా సెకెండాఫ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే ఉంటుంది.

  హాట్ వీడియోతో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: చాలా రోజుల తర్వాత ఇంత ఘాటుగా కనిపించడంతో!

  సినిమాలో ప్లస్ మైనస్ పాయింట్స్

  సినిమాలో ప్లస్ మైనస్ పాయింట్స్

  సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2'లో విక్టరీ వెంకటేష్ నటన హైలైట్‌గా నిలిచింది. తన కుటుంబాన్ని కాపాడుకునే తెలివైన వ్యక్తిగా ఆయన ఎంతో పరిణితితో నటించారు. అలాగే, జీతూ జోసెఫ్ దర్శకత్వంతో పాటు ఎంచుకున్న స్టోరీలైన్ బాగున్నాయి. వీటితో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మెప్పిస్తుంది. అయితే, ఫస్టాఫ్‌లో సాగదీత సినిమా కాస్త మైనస్‌గా మారింది.

  ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే

  ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే

  విక్టరీ వెంకటేష్ - మీనా జంటగా నటించిన ‘దృశ్యం 2' మూవీ అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకునేలా ఉందని సినిమాను వీక్షించిన వాళ్లంతా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో వచ్చే ట్విస్టులు మతి పోగొట్టేలా ఉన్నాయని అంటున్నారు. సీక్వెల్‌కు ఎలాంటి కథ ఉండాలో దర్శకుడు అలాంటిదే ఎంచుకున్నాడట. క్లైమాక్స్ సన్నివేశాలు వేరే లెవెల్ అని చెబుతున్నారు.

  హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!

  Drushyam 2 Movie Review | Venkatesh | Meena || Filmibeat Telugu
   ఆ పొరపాటు చేయకుండా ఉంటే

  ఆ పొరపాటు చేయకుండా ఉంటే

  క్రైమ్ థ్రిల్లర్ మూవీలను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరు. అందులోనూ ‘దృశ్యం 2' లాంటి సినిమాలను కచ్చితంగా వెండితెరపైనే చూడాలని అంతా అనుకుంటారు. అయితే, చిత్ర యూనిట్ మాత్రం దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసింది. దీనిపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఇలా చేయడం వల్ల మంచి ఎక్స్‌పీరియన్స్‌ను మిస్ అయ్యామని ట్వీట్లు చేస్తున్నారు.

  English summary
  Daggubati Venkatesh Did Drushyam 2 Movie Under Jeethu Joseph Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X