twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాదు: జూ ఎన్టీఆర్

    By Bojja Kumar
    |

    నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన చిత్రం 'దమ్ము'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్న అంచనాలను రీచ్ కాలేదనే చెప్పాలి. అయితే ఓపెనింగ్స్ మాత్రం భారీగానే వచ్చాయి. ఇదే విషయాన్ని జూ ఎన్టీఆర్ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

    హిట్లు ప్లాపులు అనేవి ఒక నటుడి కెరీర్లో సర్వ సాధారణం. అయితే ఏ సినిమా చేసినా ప్రేక్షకులను, అభిమానులను మెప్పించడానికి శక్తిమేర ప్రయత్నిస్తుంటాం. దమ్ము చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి..కానీ బ్లాక్ బస్టర్ సినిమాగా టర్న్ కాలేక పోయిందని జూనియర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

    ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం కథ, స్కిప్టుపై చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. ఈచిత్రం తప్పకుండా అభిమానులను, ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తుందని అంటున్నారు.

    ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

    తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.

    English summary
    “Keeping my fans happy is my motto and I pick my films accordingly” Ntr says. “Every scene will evoke humour but it will also have a larger than life script” he adds.The scion of Nandamuri clan drew good openings for Dammu but couldn’t turn into a blockbuster. “I am passionate about films and hits and flops are a part of an actor’s career”, he concludes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X