»   » పాత్ర లో పూర్తిగా లీనమవ్వటానికే ఆ అమ్మాయిలని కలిసాడు

పాత్ర లో పూర్తిగా లీనమవ్వటానికే ఆ అమ్మాయిలని కలిసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అమీర్ ఖాన్ ఓ ప్రాజెక్టు మొదలెట్టాడంటే అది సాదా సీదాగా చేయడు. స్క్రిప్టుపై పూర్తి శ్రద్ద పెడతాడు. అలాంటిది ఆయన ఓ బయోపిక్ లో నటిస్తున్నాడంటే ఇంకేముంది. ఆ వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటుంటారు అమీర్ ఖాన్. ఆమీర్‌ ఖాన్‌ ఇప్పుడు అదే పని మీద ఉన్నాడు.

'దంగల్‌' పేరుతో ఆమీర్‌ ఓ సినిమా చేస్తున్నాడు. మల్లయోధుడు మహవీర్‌ ఫోగట్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మహవీర్‌ కుమార్తెలు బబిత, గీతా ఫోగట్‌ను ఆమీర్‌ కలిశాడు.

Dangal: Aamir Khan meets Mahavir Phogat daughters Geeta and Babita

''మహవీర్‌ గురించి పూర్తిగా తెలుసుకొని నటిస్తే ఆ పాత్ర బాగా పండుతుందని ఆమీర్‌ ఆలోచన. అందుకే బబిత, గీత ముంబయి వచ్చి ఆమీర్‌ను కలిశారు'' అని ఆమీర్‌ సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే నెల్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. నితీష్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆమీర్‌ మేనకోడలు పబ్లో సహాయ దర్శకురాలిగా పని చేస్తుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దంగాల్ అనే మూవీలో రెజ్లర్ గా కనిపించబోతున్నారు ఆమిర్ ఖాన్... ఇందుకోసం తన బాడీని బాగా బిల్డప్ చేశారు. ప్రముఖ మల్లయోధుడు మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. మహావీర్ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రను పోషించే అవకాశం మల్లికా శెరావత్ కి దక్కనుందని సమాచారం.

Dangal: Aamir Khan meets Mahavir Phogat daughters Geeta and Babita

ఈ చిత్రం గురించి తెలుసుకుని, తనంతట తానుగా ఆమిర్ భార్య పాత్ర చేస్తానని అడిగారట. మల్లిక మంచి నటి కావడంతో ఆమె ప్రతిపాదనను కాదనకుండా, ఈ పాత్ర కోసం ఆడిషన్ చేశారట. అయితే, ఇంకా అధికారికంగా మల్లికతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ, ఈ అవకాశం తనకే అని మల్లిక ఫిక్సయిపోయారట.

ఇది ఇలా ఉంటే మహావీర్ ఫోగట్ ఇద్దరు కుమార్తెలు గీత, బబిత పాత్రలకు టీవీ సీరియల్స్‌లో, కొన్ని చిత్రాల్లో నటించిన ఫాలిమానూ, ఢిల్లీకి చెందిన సాన్యఅనే బ్యాలే డ్యాన్సర్‌నూ తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.

English summary
Overwhelming response to actor-producer Aamir Khan’s tweet regarding a casting call for a new production led to the server of his office to crash. Advait Chandan, who is directing the project, says it’s “really exciting”.
Please Wait while comments are loading...