»   » అమీర్ ఖాన్ ‘దంగల్’ తెలుగులోనూ వస్తోంది...(తెలుగు ట్రైలర్)

అమీర్ ఖాన్ ‘దంగల్’ తెలుగులోనూ వస్తోంది...(తెలుగు ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దంగల్'. రియల్ లైఫ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్‌ రెజ్లర్‌ మహవీర్‌సింగ్‌ పొగట్‌ జీవిత కథపై ఈ మూవీ తెరకెక్కగా, డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా....ఈ దశాబ్దాపు ఉత్తమ చిత్రం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ మూవీతో అమీర్ ఖాన్ మరోసార బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారంటూ ప్రచారం హోరెస్తున్నారు.

ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతోంది. తాజాగా తెలుగు ట్రైలర్, పోస్టర్ రిలీజ్ చేసారు.

rn

తెలుగు ట్రైలర్

పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రంతో మెప్పించిన అమీర్ ఖాన్ ఇప్పుడు దంగల్ తో మరోసారి అభిమానులు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం కోసం అమీర్ బాగానే కసరత్తులు చేశాడు.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దంగల్ మూవీకి సంబంధించి ఇటీవల ట్రైలర్ ని విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ట్రైలర్ కు కూడా రెస్పాన్స్ బావుంది

rn

చిత్రంలోని తొలి పాట

ఇక తాజాగా చిత్రంలోని తొలి పాట హానీకారక్ బాపు అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. సర్వార్ ఖాన్ మరియు సర్తాజ్ ఖాన్ పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. ప్రీతమ్ అందించిన సంగీతంకు మంచి అప్లాజ్ వస్తోంది. తాజాగా విడుదలైన తొలి సాంగ్ లో తన కూతుళ్ళను రెజ్లర్ గా తయారు చేసేందుకు తండ్రి వారిపై ఎంతటి శ్రద్ద వహించాడో ఈ సాంగ్ లో చూపించారు.

అమీర్ ఖాన్, మహవీర్‌సింగ్‌ పొగట్‌

అమీర్ ఖాన్, మహవీర్‌సింగ్‌ పొగట్‌

'దంగల్' మూవీ 'అమీర్' చేసిన '3 ఇడియట్స్', 'పీకే' కన్నా గొప్ప ఉంటుందని బాలీవుడ్ సెలెబ్రిటీస్ అంటున్నారు. మామూలుగానే 'అమీర్' సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. దీనికి తోడు ఈ వ్యాఖ్యలతో 'దంగల్' పై అంచనాలు మరింత పెరిగాయి. డిసెంబరు 23న 'దంగల్' ప్రేక్షకుల ముందుకొస్తుంది.

English summary
Dangal is an extraordinary true story based on the life of Mahavir Singh and his two daughters, Geeta and Babita Phogat. The film traces the inspirational journey of a father who trains his daughters to become world class wrestlers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu