»   » చిరుతో విబేధాలు, బాలయ్య-చిరు మధ్య పోటీపై.... దాసరి హాట్ కామెంట్స్!

చిరుతో విబేధాలు, బాలయ్య-చిరు మధ్య పోటీపై.... దాసరి హాట్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 7న గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు దర్శకరత్న దాసరి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

ఇండస్ట్రీలో దాసరి, చిరంజీవి మధ్య విబేధాల ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా ఉంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇలాంటి వార్తలకు బలం చేకూర్చాయి. ఈ నేపథ్యంలో దాసరి ముఖ్య అతిథిగా 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగబోతుండటం అందరినీ ఆశ్యర్చరానికి గురి చేస్తున్నాయి.

ఈ వ్యవహారం దాసరి స్వయంగా స్పందించారు. చిరంజీవి కెరీర్ లో విజయవంతమైన సినిమాలన్నింటికీ తానే ముఖ్య అతిథిగా హాజరయ్యానని అన్నారు. చిరంజీవి ఫంక్షన్ అంటే తనకు సొంత ఫంక్షన్ అని తెలిపారు.

 చిరుతో విబేధాలపై

చిరుతో విబేధాలపై

ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలపై స్పందిస్తూ...విభేదాలు, అభిప్రాయ భేదాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయని ఈ సందర్భంగా దాసరి అన్నారు. 50 ఏళ్ల కెరీర్ లో హీరోలందరినీ చూస్తూ వచ్చానని, ఒకవేళ వారిని తానేదైనా అన్నా వారు సీరియస్ గా తీసుకోరని దాసరి చెప్పుకొచ్చారు.

 చిరంజీవి స్టార్ డమ్ గురించి

చిరంజీవి స్టార్ డమ్ గురించి

చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో అగ్రస్థాయి నటుడని, చిరంజీవి తనకు అవసరమైన స్టార్ డమ్ ఇప్పటికే సంపాదించేశాడని, కొత్తగా సంపాదించడానికి ఏమీ లేదన్నారు. అయితే ఆయనకు ఇప్పటికీ ఆదరణ ఉందా? లేదా? అని చెప్పడానికి ఈ 150వ సినిమా పునాది అవుతుందని ఆయన తెలిపారు.

 చాలా కష్టపడే వ్యక్తి

చాలా కష్టపడే వ్యక్తి

చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు కూడా అంతే కష్టపడ్డాడని, అతని కష్టం గురించి చాలా విన్నానని దాసరి తెలిపారు.

సంక్రాంతి పోటీ గురించి

సంక్రాంతి పోటీ గురించి

సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలైన ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి పోటీ పడుతుండటంపై దాసరి స్పందిస్తూ.... సంక్రాంతికి 3 పెద్ద సినిమాలను భరించగల శక్తి ఉంటుంది, రెండు పెద్ద సినిమాలన్నది పెద్ద సమస్య కాదు అన్నారు. రెండూ వేటికవే వైవిధ్యమైన కథాంశం గల సినిమాలని, ప్రేక్షకులు రెండు సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేసారు.

 చిరు, బాలయ్య మధ్య పోటీ గురించి

చిరు, బాలయ్య మధ్య పోటీ గురించి

తన సినీ కెరీర్ లో దర్శకుడు రాఘవేంద్ర రావుతో ఎంత ఆరోగ్యకరంగా పోటీ పడ్డానో చిరంజీవి, బాలకృష్ణ మధ్య అంతే ఆరోగ్యకరమైన పోటీ ఉందని దాసరి అన్నారు. సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ప్రతి రంగంలోను ఉంటుందన్నారు.

పోటీ కాదు

పోటీ కాదు

సంక్రాంతి సీజన్ లో ఒకరి సినిమాలు మరొకరికి పోటీ కాదని, తొలి రోజు ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో సినిమా చూస్తారని, రెండో రోజు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఒక సినిమా చూస్తారని దాసరి అన్నారు.

English summary
Dasai Naraya Rao about Chiranjeevi and Balakrishna. Check out details. Megastar Chiranjeevi’s prestigious 150th film Khaidi No 150 pre-release event Boss Is Back has been postponed many times. Recently, the makers decided to organize the event on January 7th in Haailand, Vijayawada.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu