»   » ప్రేమ పేరుతో కామం.... దాసరి సంచలన వ్యాఖ్యలు

ప్రేమ పేరుతో కామం.... దాసరి సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ను అభినందించే కార్యక్రమంలో దాసరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ....ఒకప్పుడు ప్రేమకథలంటే ప్రేమ గొప్పదనాన్ని తెలియజేసేవిగా ఉండేవి. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రేమకథల స్వరూపం మారిపోయింది. ప్రేమ కథల పేరుతో కామకథలు తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో లగడపాటి శ్రీధర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' వంటి చక్కని ప్రేమకథ తీసాడు అని తెలిపారు.

Dasari appreciated Krishnamma Kalipindi Iddarini movie crew

చిత్ర నటుడు సుధీర్ బాబుపై కూడా దాసరి ప్రశంసల వర్షం కురిపించారు. సుధీర్ హీరోగానే కాకుండా విలన్ గా కూడా చేస్తున్నాడు. విలన్ గా నటించిన వాడే ఎపిసియెంట్ పర్సన్. రజనీకాంత్, మోహన్ బాబు వంటి వారు కూడా విలన్ గా నటించి హీరోలుగా ఎదిగిన వారే. ఇంత మంచి ప్రేమ కథలో నటించినందుకు సుధీర్ ను అభినందిస్తున్నాను అని దాసరి వ్యాఖ్యానించారు.

సుధీర్ బాబు, నందిత జంటగా ఆర్.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. కన్నడ ‘చార్మినార్' చిత్రానికి రీమేకిది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా-శ్రీధర్ నిర్మించారు.

English summary
Krishnamma Kalipindi Iddarini Movie won Jaipur International Film Festival award in best romantic movie cateogry in this regard Dasari Narayana rao appreciated the movie crew.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu