»   » మొత్తం మీరే చేసారు : దాసరి

మొత్తం మీరే చేసారు : దాసరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

"మీడియా నా వ్యాఖ్యలని వక్రీకరించింది" సాధారణంగా అనాల్సినవన్నీ అనేసి, తీరా ఆమాటలు కాస్తా కాంట్రవర్సీ అయ్యాక రాజకీయ నాయకులు తరచూ వాడే మాట ఇది. కానీ రీసెంట్ గా దర్శక రత్న దాసరి కూడా ఇదే మాటన్నారు. చిరంజీవికీ తనకీ మధ్య విభేదాలు కేవలం మీడియా సృష్టే అంటూ తప్పంతా మీడియాదే అని తేల్చేసారు.

తాజాగా ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం గా ఆయన ఈ వ్యాఖ్యలు చెసారు. "నాకూ చిరంజీవికీ ఎప్పుడూ స్పర్థలు లేవు అవన్నీ మీరు సృష్టించీనవే. బిడ్డమీద తండ్రికి కోపం ఉంటుందా? అంటూ యాంకర్ కి ఎదురు ప్రశ్న వేయటంతో సదరు యాంకరే కాదు టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు కూడా అవాక్కయ్యారు..

ఇండస్ట్రీలో జరిగే సగం గొడవలకు కారణం మీడియానే అని ఆయన విశ్లేషించారు. తనకు, చిరంజీవికి మధ్య వచ్చే ప్రతీ వివాదానికి కారణం మీడియానే అని కాస్త అసహనంగానే చెప్పిన దర్శక రత్న ఎప్పుడూ ఉండే కూల్ స్వభావాన్ని కొద్దిసేపు పక్కన పెట్టారు.

Dasari Blames Media For Controversy between chiru and him

"సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకలో నేను ఎన్టీఆర్, ఏఎన్నార్ పేరు ఎత్తి చిరంజీవి పేరు చెప్పకపోవడాన్ని కావాలనే హైలైట్ చేసి చిరంజీవికీ తనకీ మధ్య ఏదో ఉందన్నట్టుగా ప్రచారం చేసింది మీరే,అప్పుడు నేను బాల కృష్ణ పేరు కూడా ఎత్త లేదు అంటే బాలకృష్ణ మీద నాకు కోపం ఉన్నట్టేనా? మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు ... " అంటూ మీడియా మీద కాస్త ఘాటుగానే రియాక్టయ్యారు దాసరి.

ఈ తరం హీరోల్లో పవన్ కళ్యాణ్ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు.. ఆ తర్వాత బన్నీ అదే రూట్ లో వెళ్తున్నాడు అని తాను చెబితే కావాలనే ఈ తరం అనే పదాన్ని తీసేసి. చిరంజీవి పేరెత్తకపోవడాన్ని హైలైట్ చేసారంటూ చిరాకు పడ్డారు దాసరి.

"మీరు చిరంజీవి గారి మీద ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదా?" అని అడిగినప్పుడు కాస్త అసహనానికి లోనయ్యారు కూడా. అయినా దాసరి కూడా పత్రికా రంగంనుంచి వచ్చిన వారే.... మీడియా గురించి ఆయనకి కాక ఎవరికి తెలుస్తుంది చెప్పండి....

English summary
media only created it all.., I have no clashes with Chiranjeevi said Director Dasari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X