»   » హీరో క్షమాపణకు దాసరి డిమాండ్

హీరో క్షమాపణకు దాసరి డిమాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరిశ్రమలో అందరి చేతా గురువుగారు అని పిలిచుకుంటూ పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు. ఆయనని తాజాగా ఏపీ ఫిల్మ్ ఫిల్మ్ జర్నలిస్ట్ అశోసియేషన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిసినట్లు సమాచారం. ఎందుకంటే సిద్దార్ధ తన చిత్రం 180 ప్రమోషన్ టైమ్ లో ట్విట్టర్ లో మీడియాపై వ్యాఖ్యులు చేసి వారి మనోభావాలు దెబ్బ తీసారు.దాంతో వారు సిద్దార్ధ ప్రెస్ మీట్స్ ని బహిష్కరించటమే కాకుండా పిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ కూడా చేసారు. ఈ నేఫధ్యంలో ఛాంబర్ నుంచి రెస్పాన్స్ ఏమీ రాలేదు. సిద్దార్ద ప్రశాంతంగా దిల్ రాజు చిత్రమైన ఓహ్ మై ప్రెండ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దాంతో వారంతా దాసరిని కలిసి సమస్య వివరించారు.

దాసరి వారి సమస్య సానుకూలంగా విని వెంటనే దిల్ రాజుని కబురు పంపి..సిద్దార్ద చేత క్షమాపణ చెప్పించమని డిమాండ్ చేసినట్లు సమాచారం. అలా చేయకపోతే ఈ సమస్య పెద్దదవుతుందని, నేషనల్ లెవెల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా కూడా సిద్దార్ద ని బ్యాన్ చేసే అవకాశముందని హెచ్చరించిట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు ఏమి సమాధానం చెప్పాడన్నది తెలియరాలేదు. ఇక ఓహ్ మై ప్రెండ్ చిత్రంలో సిద్దార్ద సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా కేరళలో జరిగింది. ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు.

English summary
Electronic media has lodged a complaint against Siddharth with MAA, but it remains unaddress ed until now. Now they approached the senior director of the industry Dasari Narayana Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu