»   » పవన్ కళ్యాణ్‌కు ఆ ధైర్యం ఉంది: దాసరి కామెంట్

పవన్ కళ్యాణ్‌కు ఆ ధైర్యం ఉంది: దాసరి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ధైర్యం ఉన్నవాళ్లు రాజకీయాల్లో సక్సెస్ అవుతారని, పవన్ కు ఆ ధైర్యం ఉందని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సున్నితమైన మనసు ఉంటే రాజకీయాల్లోకి రావద్దన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం పవన్ కళ్యాణ్ కి ఉంది అన్నారు.

దాసరి నుండి ఈ మాట రావడంతో.... పవన్ కళ్యాణ్-దాసరి కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న తరుణంలో దాసరి లాంటి వ్యక్తుల నుండి పొటికల్ సెటైరిక్ ఉన్న సినిమా వస్తే...అందులో పవన్ కళ్యాణ్ లాంటి పొలిటికల్ ఇమేజ్ ఉన్న హీరో నటిస్తే మంచి హిట్టవుతుందని అంటునన్నారు.

Dasari Narayana Rao about Pawan Kalyan political entry

గతంలో దాసరి నుండి ఎన్నో పొలిటికల్ సెటైర్ ఉన్న సినిమాలు వచ్చాయి. వీటితో పాటు సమాజంలో ఉన్న సమస్యలు, వాటిని సరిగా పట్టించుకోని ప్రభుత్వాలపై సెటైర్స్ వేస్తూ పలు చిత్రాలు దాసరి తెరకెక్కించారు.

1980లలో ఎన్టీఆర్ తో దాసరి తీసిన సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి నటరత్న రాజకీయ రంగ ప్రవేశానికి ఎంతగానో తోడ్పడ్డాయి. రామారావుకు ఆ సినిమాలు మాస్ లో పొలిటికల్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ కు కూడా దాసరి సినిమా ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్, దాసరి సినిమాకు ఇంకా దర్శకుడు ఖరారు కాక పోయినా.... రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖరారయ్యాడు. అయన నుండి ఈ సినిమా కోసం పదునైన రాజకీయ పంచ్ డైలాగులు రాయిస్తారని తెలుస్తోంది.

English summary
Tollywood legendary director Dasari Narayana Rao about Pawan Kalyan political entry.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu