»   » దాసరి..! మీరు మరీ..!! చిన్న సినిమా కదా అని చిన్న చూపులేదు... టీమ్ ని ఇంటికి పిలిచి మరీ..

దాసరి..! మీరు మరీ..!! చిన్న సినిమా కదా అని చిన్న చూపులేదు... టీమ్ ని ఇంటికి పిలిచి మరీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏదైనా ఓ సినిమా విజయం సాధిస్తే.. ఎక్కువగా ఆనందించేవారిలో దర్శకరత్న డా.దాసరి ఒకరు. ముఖ్యంగా ఓ చిన్న సినిమా పెద్ద విజయం సాధిస్తున్నప్పుడు దాసరి మరింతగా సంతోషిస్తారు. సదరు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ అభినందనల వర్షం కురిపిస్తారు. దాసరి ప్రశంస ఓ "ఐ ఎస్ ఐ" మార్క్ లాంటిది. ఓ సినిమాను దాసరి ప్రత్యేకంగా ప్రశంసించారంటే.. ఆ సినిమా "కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా" అని అందరూ ఫిక్సయిపోతారు. ఈమధ్య నిర్మలా కాన్వెంట్, పెళ్ళిచూపులు సినిమాల గురించికూడా తన రివ్యూని, సినిమా యూనిట్ కి ప్రశంసలనీ అందజేసి. తన సినీ అభిమానాన్నీ, చిన్న పెద్దా తేడాలేని బోళా తనాన్నీ చాటుకున్నారాయన. "పెళ్ళిచూపులు" తర్వాత దర్శకరత్న డా.దాసరి అభినందనలందుకొన్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్ము రా". ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేయించుకొని వీక్షించిన దాసరి- దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డిలను ఇంటికి పిలిపించుకొని మరీ మీడియా సమక్షంలో వాళ్ళను అభినందించారు. ఆ సంధర్భంగా....

దర్శకరత్న కొనియాడారు:

దర్శకరత్న కొనియాడారు:

సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత నుంచి సినిమాలో తనకు శ్రీనివాస్ రెడ్డి కనిపించడం మానేశాడని.. ఫస్టాఫ్ లో సర్వమంగళం, సెకండాఫ్ లో సర్వేష్ మాత్రమే కనిపించాడని దాసరి అన్నారు. రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ శివరాజ్ కనుమూరి- "జయమ్ము నిశ్చయమ్ము రా" చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతమని దర్శకరత్న కొనియాడారు.


మరో మంచి దర్శకుడు:

మరో మంచి దర్శకుడు:

టాలీవుడ్ కు మరో మంచి దర్శకుడు దొరికినట్లేనని ఈ సందర్భంగా దాసరి అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం ద్వారా కృష్ణభగవాన్ కు మళ్ళీ మంచి గుర్తింపు వస్తుందని, పోసాని పోషించిన పంతులు పాత్ర తనకెంతగానో నచ్చిందని దాసరి పేర్కొన్నారు. హీరోహీరోయిన్ల పాత్రలతోపాటు- సినిమాలోని ప్రతి పాత్రను దర్శకుడు చూడముచ్చటగా తీర్చిదిద్దాడని దాసరి అన్నారు.


దాసరిగారితోనే మొదలైంది:

దాసరిగారితోనే మొదలైంది:

ఇప్పటికే మంచి విజయం సాధిస్తున్న ఈ చిత్రం- మరింత పెద్ద విజయం సాధించాల్సిన అవసరం ఉందని దాసరి అన్నారు. ఒక కమెడియన్ హీరోగా చేయడమనే ట్రెండ్ దాసరిగారితోనే మొదలైందని, ఘన విజయం సాధించిన దాసరి తొలి చిత్రం "తాత మనవడు" దర్శకుడిగా తనను ఎంతగానో ప్రభావితం చేసిన సినిమాల్లో ఒకటని దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి అన్నారు.


జీవితాంతం గుర్తుంచుకొంటానని:

జీవితాంతం గుర్తుంచుకొంటానని:

దాసరి వంటి లెజండరీ డైరెక్టర్ ప్రత్యేకంగా పిలిపించుకొని ప్రశంసించడం జీవితాంతం గుర్తుంచుకొంటానని కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సంచలనానికి పర్యాయపదంగా చెప్పుకొనే దాసరి వంటి ఆల్ రౌండర్ "జయమ్ము నిశ్చయమ్ము రా" చిత్రాన్ని ప్రశంసించడం ఓ పెద్ద అవార్డులా భావిస్తున్నామని ఈ చిత్రాన్ని ఉభయ రాష్ట్రాల్లో విడుదల చేసిన ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి అన్నారు!


మంచి మార్కులు:

మంచి మార్కులు:

శ్రీనివాస్ రెడ్డిని నటుడిగా సరికొత్త కోణంలో పరిచయం చేసిన చిత్రమిది. ఓ సగటు యువకుడి మనసులో ఉండే భావాల్ని శ్రీనివాస్ రెడ్డి తెరపై పలికించిన తీరు ప్రశంసనీయం. ఎమోషన్స్‌తో పాటు కామెడీని కూడా విశేషంగా పండించి నటుడిగా మంచి మార్కులు సంపాదించుకొన్నాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పూర్ణ ఈ చిత్రంతో మంచి రీఎంట్రీ ఇచ్చింది.


పూర్తి స్థాయిలో న్యాయం:

పూర్తి స్థాయిలో న్యాయం:

అచ్చమైన తెలుగమ్మాయిగా నిండైన కట్టు-బొట్టుతో ఆకట్టుకొంది. ‘అడపా ప్రసాద్'గా కృష్ణభగవాన్, ‘తత్కాల్'గా ప్రవీణ్ లు పంచ్ డైలాగ్స్, మేనరిజమ్స్ తో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచి, థియేటర్ లో నవ్వులు విరబూయించారు. శ్రీవిష్ణు, రవివర్మలు తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి కథలో కీలక పాత్రలు పోషించారు.


శివరాజ్ కనుమూరి :

శివరాజ్ కనుమూరి :

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ‘గీతాంజలి' అనంతరం హీరోగా నటించిన రెండో చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా'. శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో పూర్ణ కథానాయికగా నటించిన ఈ చిత్రం టైటిల్ కి తగ్గట్లు సినిమాకి చిన్న సినిమాల్లో పెద్దవిజయాన్నే దక్కింది. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్దికీ, హీరోయిన్ పూర్ణ కి మంచి గుర్తింపు వచ్చింది.


English summary
Tollywood Top Director Dasari Narayana Rao Appreciated Jayammu Nichayammu Raa Movie Team.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu