»   » ఇంకా ఆసుపత్రిలోనే దాసరి... ఇదీ తాజా పరిస్థితి (ఫోటో)

ఇంకా ఆసుపత్రిలోనే దాసరి... ఇదీ తాజా పరిస్థితి (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు నెల రోజుల క్రితం తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దాసరి ఆసుపత్రిలో చేయడం ఇండస్ట్రీని, అభిమానులను షాక్ కు గురి చేసింది. ఆ సమయంలో కిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేసారు.

ఇంకా ఆసుపత్రిలోనే దాసరి

ఇంకా ఆసుపత్రిలోనే దాసరి

ఈ హెల్త్ బులిటెన్ తర్వాత మళ్లీ దాసరి ఆరోగ్య పరస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాసరి ఆరోగ్య పరిస్థితి ఇపుడు కాస్త నిలకడగానే ఉంది. అయితే ఆయన ఇంకా వైద్యుల పరవేక్షణలోనే ఉన్నారు.

 మా ప్రెసిడెంట్ శివాజీ రాజా పరామర్శ

మా ప్రెసిడెంట్ శివాజీ రాజా పరామర్శ

రాజేంద్ర ప్రసాద్ పదవీ కాలం ముగియడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్ శివాజీ రాజా ఎంపికయ్యారు. మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శివాజీ రాజా దాసరిని ఆసుపత్రిలో పరామర్శించారు. దాసరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన తర్వగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగా రావాలని ఆయన ఆకాంక్షించారు.

నెల రోజుల క్రితం హెల్త్ బులిటెన్లో వైద్యులు ఇలా

నెల రోజుల క్రితం హెల్త్ బులిటెన్లో వైద్యులు ఇలా

నెల రోజుల క్రితం రిలీజ్ చేసిన హుల్త్ బులిటెన్లో అన్నవాహిక ఇన్ఫెక్షన్ రావడంతో అది రప్చర్ అయిందని, దానికి ఆపరేషన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిందని, దానికి డయాలసిస్ చేసినట్లు వైద్యులు తెలిపారు. లంగ్స్ ఫెయిల్యూర్ కూడా రావడంతో వెంటిలెటర్ మీద చికిత్స చేసామని, చికిత్స తర్వాత లంగ్స్ బాగానే పని చేస్తున్నాయని తెలిపారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్ల ఇన్ ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు రోజుల్లో ఆయన బాగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

చిరంజీవి నిర్ణయంతో దాసరి ఆనందం, అసలేం జరిగింది?

చిరంజీవి నిర్ణయంతో దాసరి ఆనందం, అసలేం జరిగింది?

దాసరి నారాయణరావు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని ఇండస్ట్రీ వర్గాలు హర్షిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Currently, Dasari Narayana Rao health condition is getting improved but he is kept under observation considering lung infection and kidney issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu