twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అద్బుతం అంటూ బాలకృష్ణ పై దాసరి ప్రశంసల జల్లు

    By Srikanya
    |

    హైదరాబాద్ : నటుడిగా, సేవాదృక్పథం కలిగిన వ్యక్తిగా బాలయ్య....ద్విపాత్రలను అద్భుతంగా పోషిస్తున్నాడంటూ దాసరి నారాయరావు కితాబిచ్చారు. బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి అండ్‌ రిసర్చి ఇన్‌స్టిట్యూట్‌ (బీఐఏసీహెచ్‌ అండ్‌ ఆర్‌ఐ) ఆధ్వర్యంలో రొమ్ముక్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాన్ని ఆసుపత్రి ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. దాసరి ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్బంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ...ఆసుపత్రిలోని వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

    అలగే...తన తండ్రికి క్యాన్సర్‌ సోకిందని, అయితే ఆ మనోవ్యధతో తన తల్లి.. తండ్రి కంటే ముందుగా మృతి చెందిందని తెలిపారు.క్యాన్సర్‌పై లఘుచిత్రాన్ని నిర్మించి చలనచిత్రాల ప్రదర్శనకు ముందుగా దీనిని ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా.. సేవలందించేందుకు సినీరంగం నుంచి తరలివచ్చిన మహోన్నత వ్యక్తి దివంగత ఎన్టీఆర్‌ అంటూ కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ప్రశంసించారు.

    ఆసుపత్రి వైద్యులు డా.సీకే నాయుడు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అత్యధికంగా రొమ్ముక్యాన్సర్‌ కేసులకు చికిత్స అందించిన ఘనత బసవతారకం ఆసుపత్రిదేనన్నారు. ఆసుపత్రికి విరాళాలను అందజేసిన దాతలు శ్రీదేవి-స్వేచ్ఛ ఫౌండేషన్‌, శ్రీనివాస్‌-పీవీకే ఏజెన్సీస్‌, విశ్రాంత ఉద్యోగి రమణ్‌రావులను దాసరి, బాలకృష్ణ సత్కరించారు. వీరిలో శ్రీనివాస్‌ అందించిన ఆర్థికసాయంతో వ్యాధిని జయించిన నందిని అనే అమ్మాయిని బాలకృష్ణ అభినందించారు.

    బెంగళూరు నుంచి వచ్చిన బాలకృష్ణ అభిమానులు కొత్తూరు జి.మంజునాధ్‌, కృష్ణమూర్తి, రాము, జయరామ్‌లు రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. శిశు, మహిళా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బసవతారకం మెమోరియల్‌ ట్రస్టును పునఃప్రారంభిస్తామని బాలకృష్ణ వెల్లడించారు. దీనిద్వారా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన వారిని సైతం ఆదుకుంటామన్నారు.

    ప్రస్తుతం బాలకృష్ణ 'లక్ష్యం' ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నారు. క్రేజీ రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత, తదితర వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

    English summary
    
 Dasari Narayana Rao attend Cancer awareness programme at The Basavatarakam Indo American Cancer Hospital & Research Institute. At that Programme he Showers Praises On Balakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X