twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రెడిట్ మాదే అంటూ... దాసరి-చిరు వర్గాల సిగపట్లు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : తెలుగు సినిమా రంగంలో గ్రూపు రాజకీయాలు ఎప్పటి నుంచో నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ గ్రూపులు....దాసరి నారాయణరావు వర్గం, చిరంజీవి వర్గం. ఈ రెండు వర్గాల మధ్య తరచూ ఏదో ఒక విషయంలో అభిప్రాయం బేధాలు, ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. గతంలో జరిగిన పలు సంఘటనలే అందుకు నిదర్శనం.

    తాజాగా ఈ రెండు వర్గాల మధ్య మరో వివాదం చెలరేగింది. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమపై విధించిన VAT(విలువ ఆధారిత పన్ను) ను ఎత్తి వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడటం వల్లనే వ్యాట్ రద్దు చేసారని చిరంజీవి వర్గం ప్రచారం చేసింది. అంతటి ఆగకుండా ఆయన వర్గానికి చెందిన కొందరు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కేలా పక్కా వ్యూహం రచించారు.

    దీంతో చిర్రెత్తిన దాసరి నారాయణరావు వర్గం....ఇందులో చిరంజీవి చేసిందేమీ లేదని, దాసరి నారాయణరావు వల్లనే పరిశ్రమకు ఈ మేలు జరిగిందని, ముఖ్యమంత్రి కిరణ్‌తో మాట్లాడి ఈ మ్యాటర్ సెటిల్ చేసారని పుంగి భజాయిస్తూ రంగంలోకి దిగారు. దాసరి నారాయణరావు శిష్యుడు నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ....నిర్మాతల మండలితో కలిసి దాసరి నారాయణరావు VAT ఎత్తివేయించడంలో కృషి చేసారని, ఇందులో చిరంజీవి చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. నట్టితో పాటు జీవిత రాజశేఖర్, మోహన్ గౌడ్ కూడా మీడియా సమావేశంలో పాల్గొని దాసరి నారాయణరావుదే ఈ క్రెడిట్ అంటూ నొక్కి వక్కానించారు. మరి ఈ VAT క్రెడిట్ వివాదం ఎంత వరకు వెలుతుందో.....నిజంగా ఈ క్రెడిట్ ఎవరిదో తేలాల్సి ఉంది.

    English summary
    
 Tollywood Producer Natti Kumar speaking to media on the issue of Govt doing away with VAT on films said the decision will help industry and revealed that Dasari Narayana Rao worked hard for this since long time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X