twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పత్రికాధినేతగా.. కేంద్రమంత్రిగా దాసరి సంచలనాలు..

    ప్రముఖ దర్శకుడు, పత్రికాధినేత, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ జీవితం అనేక సంచలనాలకు వేదిక. తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన అనతికాలంలో తెలుగు సినిమా పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత

    By Rajababu
    |

    ప్రముఖ దర్శకుడు, పత్రికాధినేత, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ జీవితం అనేక సంచలనాలకు వేదిక. తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన అనతికాలంలో తెలుగు సినిమా పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత ఆయన ఉదయం పత్రికను స్థాపించి మరో సంచలనానికి తెరతీశారు. ఉదయం పత్రికను ప్రజల పత్రికగా మలచడంలో సఫలమయ్యాడు. ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన తనదైన ముద్రను వేశారు.

    కాంగ్రెస్ పార్టీకి అండగా..

    కాంగ్రెస్ పార్టీకి అండగా..

    రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దాసరి నారాయణరావు కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. రాజీవ్ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ తరఫున క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

    కేంద్రమంత్రిగా..

    కేంద్రమంత్రిగా..

    కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కీలక సేవలను అందింంచారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. ఆరోగ్య కారణాల వల్ల ఆయన ఇటీవల కాలంలో పార్టీకి దూరంగా ఉంటున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మృతి చెందడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ పెద్ద దిక్కు కోల్పోయింద.

    ఉదయం పత్రిక అధినేతగా..

    ఉదయం పత్రిక అధినేతగా..

    1984 సంవత్సరంలో దాసరి నారాయణరావు ఉదయం దినపత్రికను ప్రారంభించారు. ఉదయం పత్రికను తారక ప్రభు పబ్లికేషన్స్ సంస్థ నిర్వహణలో ప్రచురితమైంది. ఆ సమయంలో రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఏబీకే ప్రసాద్ ఎడిటర్‌గా సేవలందించారు. ఉదయం పత్రిక తొలుత హైదరాబాద్, విజయవాడ నుంచి వెలువడింది. ఏబీకే ప్రసాద్ తర్వాత ఉదయం పత్రికకు కే రామచంద్రమూర్తి, కెఎన్‌వై పతంజలి పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించారు.

    ఆర్థిక సమస్యల కారణంగా మూతపడిన..

    ఆర్థిక సమస్యల కారణంగా మూతపడిన..

    1991లో మాగుంట సుబ్బరామరెడ్డి ఉదయం పత్రికను కొన్నారు. గజ్జెల మల్లారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, కే రామచంద్రమూర్తి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు మరియు కార్మిక సమస్యలు కారణంగా ఉదయం పత్రిక మూతపడింది.

    English summary
    Dasari Narayana Rao started his career as Film director. after his travel move to Politics, and Press Industry. He sansation parsonality in the all aspects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X