twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి కామెంట్స్ ఎవరిపై: పవన్ పైనా ?, చిరు పైనా?చరణ్ పైనా?

    By Srikanya
    |

    హైదరాబాద్: దాసరి ఏదైనా ఆడియో పంక్షన్ లేదా, సక్సెస్ మీట్ , సినిమా ఈవెంట్ దేనికి వచ్చినా ఆయన ఏదో ఒక కామెంట్ ఇండస్ట్రీపై పాస్ చేయటం..దానిపై చర్చ జరగటం గత కొంతకాలంగా జరుగుతున్న నిత్యకృత్యం. తాజాగా ఆయన పెళ్లిచూపులు చిత్రం సక్సెస్ మీట్ కు వచ్చి మరోసారి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

    ఇంతకీ ఆయన ప్రత్యేకంగా అన్నమాటలు ఏమిటయ్యా అంటే... రీమేక్‌లపై మోజు వద్దు అని... అయితే తెలుగులో ఇప్పుడు రీమేక్ లు చేస్తున్నది స్టార్ హీరోలలో ప్రముఖంగా కనపడుతున్నది... పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, మరొకరు వెంకటేష్.

    పవన్ కళ్యాణ్ తాజాగా తమిళ సూపర్ హిట్ వేదాలం రీమేక్ చెయ్యాలని నిర్ణయంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఆయన గత కొంతకాలంగా రీమేక్ లనే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు.

    సర్దార్ గబ్బర్ సింగ్ కు ముందు వచ్చిన గోపాల గోపాల చిత్రం హిందీ చిత్రం ఓ మై గాడ్ కు రీమేక్ అయితే, అంతకు ముందు వచ్చిన బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్..హిందీ దబాంగ్ కు రీమేక్. అయితే మధ్యలో అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ సైతం ఒరిజనల్ కథతో వచ్చింది.

    చిరంజీవి ..తన 150 వ చిత్రంగా కత్తి రీమేక్ చేస్తూంటే, రామ్ చరణ్ తన తాజా చిత్రంగా తని ఒరువన్ చిత్రం రీమేక్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్ లో ఎక్కువ శాతం రీమేక్ ల మీద ఆధారపడి సినిమాలుచేసి సక్సెస్ ఇచ్చినవే. ఇప్పుడు ఆయన సాలా కుద్దాస్ చిత్రం రీమేక్ కు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

    ఈ నేపధ్యంలో దాసరి...రీమేక్ లపై మోజు వద్దు అంటూ చేసిన కామెంట్స్ ఈ ఇద్దరు హీరోలను ఉద్దేశించి అన్నవి గా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన క్యాజువల్ గా అన్నాడని, ఏ హీరోని ఆయన దృష్టిలో పెట్టుకుని అనలేదని కొందరు అంటున్నారు. అయితే ఆయన చెప్పిన మాట మాత్రం మంచిదే అని చెప్తున్నారు.

    ఇంతకీ దాసరి ఏమన్నారు, మిగతా విశేషాలు స్లైడ్ షోలో...

    ఏ స్టేజిపై....

    ఏ స్టేజిపై....

    సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘పెళ్ళిచూపులు' కృతజ్ఞతాపూర్వక సమావేశానికి దాసరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర హీరో,హీరోయిన్స్ విజయ్‌ దేవరకొండ, రీతూవర్మ, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, నిర్మాతలు రాజ్‌ కందుకూరి, యష్‌ రాగినేనిలను దాసరి ప్రశంసించారు.

    స్టార్ హీరోలంతా ఒకప్పుడు..

    స్టార్ హీరోలంతా ఒకప్పుడు..

    చిన్న సినిమా అనేది ఉండదు. ఉన్నదంతా బడ్జెట్‌ సినిమా, భారీ బడ్జెట్‌ సినిమానే. ప్రస్తుత స్టార్ హీరోలంతా కూడా ఒకప్పుడు పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమా నుంచి వచ్చినవారే అన్నారు దాసరి

    చిన్న సినిమాలే నిలుస్తాయి

    చిన్న సినిమాలే నిలుస్తాయి

    భారీ బడ్జెట్‌ సినిమాలు రికార్డులు తిరగరాసినా, చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచే సినిమాలు పరిమిత వ్యయంతో తెరకెక్కినవి మాత్రమే'' అన్నారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు.

    నాకు పేరు తెచ్చినవి అవే

    నాకు పేరు తెచ్చినవి అవే

    తొలి రోజుల్లో పాతిక సినిమాలు నేను పరిమిత వ్యయంతోనే తెరకెక్కించా. ఆ తర్వాత నేను ఎన్ని పెద్ద సినిమాలు తీసినా గొప్ప పేరు తెచ్చిపెట్టినవి మాత్రం అవే.

    అలా సూపర్ హిట్టయ్యాయి

    అలా సూపర్ హిట్టయ్యాయి

    ‘నీడ'ని లక్ష రూపాయల్లో తీశా. 28 కేంద్రాల్లో 110 రోజులు ప్రదర్శితమైంది. ‘స్వర్గం- నరకం' రెండు లక్షల్లో తీస్తే ఏడాది ఆడి ఆదరణ పొందింది అన్నారు దాసరి

    చక్కటి స్క్రీన్ ప్లే తో

    చక్కటి స్క్రీన్ ప్లే తో

    అంగాంగ ప్రదర్శన, పోరాటాలు, వెకిలి చేష్టలు, వెటకారాలేవీ లేకుండా వాస్తవిక జీవితానికి అతి దగ్గరగా చక్కటి స్క్రీన్‌ప్లేతో ‘పెళ్ళిచూపులు' చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. కొత్త సాంకేతికబృందమైనా చక్కటి ప్రతిభని ప్రదర్శించింది. ఈ బృందం ఇకపై కూడా ఇలాగే ప్రయాణం చేయాలి.

    దుస్దితి వద్దు

    దుస్దితి వద్దు


    ఐదారు సంవత్సరాల నుంచీ తెలుగు సినిమా నాశనమైపోతోందా? అన్నంతగా ఆందోళన చెందుతున్నాను. బడ్జెట్‌లు, థియేటర్లు... ఇలా అన్నీ పెంచేసుకుంటూ, నియంత్రణ కోల్పోయి చేతులు కాల్చుకునే దుస్థితి తెచ్చుకోవద్దని నిర్మాతలకి నా మనవి.

    ఆచరించాలి

    ఆచరించాలి


    మంచి కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ, స్థాయికి తగినన్ని థియేటర్లలో విడుదల చేయడం, డిమాండ్‌ని బట్టి థియేటర్ల పెంపుదల చేయడం వంటివి ఆచరించాలి. అప్పుడు అన్ని సినిమాలకీ థియేటర్లు లభిస్తాయి, ఆదరణకి నోచుకుంటాయి.

    రీమేక్ లు వద్దు

    రీమేక్ లు వద్దు


    ఈమధ్య రీమేక్‌లపై మోజు పెంచేసుకుంటున్నాం. అది సరికాదు. మనలో ప్రతిభ ఉన్నవారు చాలామంది ఉన్నారు''అన్నారు దాసరి.

    చిత్ర సమర్పకుడు డి.సురేష్‌బాబు మాట్లాడుతూ....

    చిత్ర సమర్పకుడు డి.సురేష్‌బాబు మాట్లాడుతూ....

    ‘‘చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకి ఆనందాన్ని పంచే ఓ మంచి సినిమాని అందివ్వగలిగాం'' అన్నారు.

    నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ....

    నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ....

    ‘‘సింక్‌ సౌండ్‌ సాంకేతిక పరిజ్ఞానం వల్ల బడ్జెట్‌లోనే ఈ సినిమాని ప్రేక్షకులకి నచ్చేలా తరుణ్‌ తెరకెక్కించాడు''అన్నారు.

    ఆ కారణం తోటే

    ఆ కారణం తోటే

    ‘‘రాజ్‌, సురేష్‌బాబు నన్నూ, నా కథని నమ్మి ప్రోత్సహించిన కారణంగానే ఈ విజయం సాధ్యమైంది''అన్నారు దర్శకుడు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...


    ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రీతూవర్మ, నందు, ప్రియదర్శి, సంగీతదర్శకుడు వివేక్‌ సాగర్‌, సౌండ్‌ సంజయ్‌, ఛాయాగ్రాహకుడు నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Dasari Narayana Rao always known for his straight forwardness. Yesterday while speaking at Pelli Choopuli Movie thanks meet he showed his discomfort on the present situations in Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X