»   » వర్మ కూతురు, మనవడు కథాకమామీషు

వర్మ కూతురు, మనవడు కథాకమామీషు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Daughter of Varma film on this friday
హైదరాబాద్ : చిన్న వయసులో తండ్రి అయిన ఓ వ్యక్తి తన కూతురి వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటి వల్ల అతని జీవితంలో వచ్చిన మార్పులేమిటనే కథాంశంతో 'డాటర్ ఆఫ్ వర్మ' చిత్రాన్ని రూపొందిస్తున్నాం అంటున్నారు నటుడు వెన్నెల కిషోర్. ఆయన హీరోగా రోజా, నవీనా జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం' 'డాటర్ ఆఫ్ వర్మ'. ఖాజా దర్శకుడు. ఫరెవర్ ఫెంటాస్టిక్ ఫిలింస్ పతాకంపై ఎఫ్ త్రీ, నరేందర్ బొక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.

దర్శకుడు కాజా మాట్లాడుతూ- ఫ్యామిలీ ఓరియెంటెడ్ కామెడీతో నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది, వర్మకు ఓ కూతురు, ఓ మనవడు ఉన్న నేపథ్యంలో కూతురికి- తండ్రికి జరిగిన సంఘర్షణ ప్రధానమని తెలిపారు. టామ్ అండ్ జెర్రీ ఫ్లావర్‌తో సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు.

పెళ్లిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తికి కూతురు, మనవడు ఉన్నారని తెలియడంతో జరిగే అవకతవకలలో ఏం జరిగింది? అతను ఈ పరిణామాలనుండి ఎలా బయటపడ్డాడు? అన్న అంశంతో ఈ చిత్రం పూర్తి హాస్యభరితంగా సాగుతుందని నరేందర్‌రెడ్డి తెలిపారు.

''పేరుకి తగినట్టే తండ్రీ కూతుళ్ల కథ ఇది. టామ్‌ అండ్‌ జెర్రీ గొడవలా సరదాగా సాగుతుంది. రోజా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. వినోదం.. ప్రధాన ఆకర్షణ. అదేష్‌ రవి అందించిన పాటలకూ మంచి స్పందన వచ్చింది. చాలా సరదాగా సాగిపోయే పాత్రనాది. మేమంతా కష్టపడి పనిచేశాం. దానికి తగిన ప్రతిఫలం వస్తుందనే నమ్మకం ఉంది''అని వెన్నెల కిషోర్‌ చెప్పారు.

కార్యక్రమంలో 'వెన్నెల' కిశోర్, నవీనా జాక్సన్, షానీ, ఆదేశ్ రవి తదితరులు పాల్గొన్నారు. కవిత ఆరస్, జీవా, మేల్కొటె, ఉత్తేజ్, ధన్‌రాజ్, చంటి, ఫిష్ వెంకట్, సాయి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, పాటలు: గంగుల సురేష్, బాలు, ఆదేశ్ రవి, సంగీతం: ఆదేశ్ రవి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాతలు: నరేందర్ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కాజా.

English summary
Vennela Kishore, Naveena Jackson starrer D/O Varma directed by Khasa is ready for release on 28th of this month. Film completed its censor formalities recently and got U/A certificate. Adesh Ravi is the music director for the film. Bokka Narender Reddy is producing the film on Forever Fantastic Films banner. Roja,Jeeva,Melkote,Tagubotu Ramesh,Dhanraj,Fish Venkat are starring in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more