twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్-బన్నీ కాంప్రమైజ్!: ఎవరు ముందు?.. ఇదీ డీల్..

    |

    Recommended Video

    ఎవరు ముందు ? ఇదీ డీల్..!

    ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే నిర్మాతలకు ఎక్కడలేని భయం. థియేటర్ల విషయంలో తలెత్తే సమస్య ఒకటైతే.. రెండింటిలో దేనికి కాస్త డివైడ్ టాక్ వచ్చినా ఇక ఆ సినిమా అటకెక్కేయడం ఖాయం. కాబట్టి నిర్మాతలు కూర్చొని మాట్లాడుకుని కొద్ది వారాల గ్యాప్ తో రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది..

    నిప్పురా.. నిజంగా బ్లడ్ పెట్టి చేశాడురా..: అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ పక్కా బ్రదర్..నిప్పురా.. నిజంగా బ్లడ్ పెట్టి చేశాడురా..: అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ పక్కా బ్రదర్..

    ఇద్దరూ ఒకేసారి?

    ఇద్దరూ ఒకేసారి?

    అల్లు అర్జున్ సినిమా 'నా పేరు సూర్య'ను ఏప్రిల్ 27నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అదే టైమ్‌లో మహేష్ బాబు 'భరత్ అనే నేను' కూడా రాబోతోంది. నిజానికి మహేష్ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉన్నా.. ఎందుకనో వాయిదా పడింది. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకే రిలీజ్ డేట్‌తో వస్తే కష్టమని ఇరు సినిమాల నిర్మాతల ఆందోళన చెందుతున్నారు.

    ఒకేసారి వస్తే.. కష్టమే:

    ఒకేసారి వస్తే.. కష్టమే:

    నా పేరు సూర్య, భరత్ అనే నేను సినిమాలపై దాదాపు రూ.200కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లు టాక్. ఇంత భారీ బిజినెస్ జరిగిన సినిమాలు పోటీ లేకుండా దిగితేనే కలెక్షన్లు భారీగా రాబట్టగలవు. ఒకవేళ పోటీ ఉంటే మాత్రం.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే తప్ప కలెక్షన్లపై ఎఫెక్ట్ తప్పదు.

     కాంప్రమైజ్.. రిస్క్ వద్దనే..:

    కాంప్రమైజ్.. రిస్క్ వద్దనే..:

    రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో ఇప్పుడీ రెండు సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్స్ విషయంలో సర్దుబాటు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాలు ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారని టాక్.

    రిలీజ్ డేట్స్:

    రిలీజ్ డేట్స్:

    పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో స్పీడప్ బట్టి ఏ సినిమా ముందు రావాలనే దానిపై ఒక అంచనాకు రాబోతున్నారట. ముందు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న సినిమా.. ఏప్రిల్ 13న విడుదల కాబోతుంటే.. ఆ తర్వాత రాబోయే సినిమా ఏప్రిల్ 27నాటికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

     అల్లు సినిమా.. ఏడు భాషల్లో:

    అల్లు సినిమా.. ఏడు భాషల్లో:

    రిలీజ్ డేట్స్ సంగతి పక్కనపెడితే.. అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' టీజర్‌కు మంచి స్పందన రావడంతో.. సినిమాను ఏడు భాషల్లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు నిర్మాతలు. అల్లు అర్జున్‌ డబ్బింగ్‌ వెర్షన్‌ సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

     ఏయే భాషల్లో:

    ఏయే భాషల్లో:

    తెలుగు, తమిళం, మలయాళంలోనే కాకుండా హిందీ, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో 'నా పేరు సూర్య' విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

    English summary
    A deal has fixed between Hero's Allu Arjun&Mahesh Babu regarding their upcoming movies release dates. They are planning to release movies atleast two weeks gap to each other.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X