విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’పై రూమర్లకు తెరదించిన దర్శకుడు!

By Bojja Kumar

'డియర్ కామ్రేడ్' అనే సినిమా ఇలా ప్రకటించారో లేదో అలా రూమర్స్ మొదలయ్యాయి. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఫస్ట్ లుక్ మే 9న హీరో విజయ్ దేవరకొండ హీరోగా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీ మలయాళం మూవీకి రీమేక్ అనే వార్తలను దర్శకుడు కొట్టిపారేశారు.

దుల్కర్ సల్మాన్ హీరోగా మలయాళంలో 'కామ్రేడ్ ఇన్ అమెరికా' అనే హిట్ సినిమా వచ్చింది. విజయ్ సినిమా టైటిల్ దీనికి దగ్గరగా ఉండటంతో దీనికి రీమేక్ అనే ప్రచారం మొదలైంది. దీనిపై దర్శకుడు వివరణ ఇస్తూ ఈ రెండు చిత్రాలు పూర్తిగా విభిన్నమైనవి, ఆ సినిమాతో ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు.

'కామ్రేడ్ ఇన్ అమెరికా' మూవీలో హీరో అమెరికా వెళ్లి తన ప్రియురాలు కోసం వెతుకుతుంటాడు. ఈ చిత్రంలో దుల్కర్ ప్రేయసి పాత్రలో కార్తీక మురళీధరన్ నటించారు. అయితే ఇటీవల విడుదలైన 'మహానటి' మూవీలో విజయ్, దుల్కర్ కలిసి నటించడంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి.

Dear Comrade is not remake of CIA

'డియర్ కామ్రేడ్' మూవీ విషయానికొస్తే విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఇదో డిఫరెంట్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా ఎంపికయింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా ఖరారు చేశారు.

నూతన దర్వకుడు భరత్ కమ్మ ఒక కొత్త కాన్సెప్టుతో 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనేది సబ్ టైటిల్. 'అర్జున్ రెడ్డి' హిట్ తర్వాత చాలా కథలు విన్న విజయ్ దేవరకొండ అందులో నుండి తనకు నచ్చి 3 బెస్ట్ కథలు ఎంచుకున్నాడు. అందులో ఒకటైన 'టాక్సీవాలా' ఆల్రెడీ సెట్స్ మీద ఉండగా... రెండోది 'డియర్ కామ్రేడ్'. త్వరలోనే మూడో ప్రాజెక్టు ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X