»   » ఇంత మార్పా... అంత పెద్ద హీరోయిన్ పాపం ఎంతమారిపోయింది

ఇంత మార్పా... అంత పెద్ద హీరోయిన్ పాపం ఎంతమారిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

1990ల్లో కోట్లాది మంది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన భామ మనీషా కొయిరాలా. తెలుగులో 'క్రిమినల్'.. తమిళంలో 'భారతీయుడు'.. హిందీలో 'దిల్ సే' లాంటి చిత్రాలతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఇండియన్ సినిమా చరిత్రలో అపురూపమైన అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందింది మనీషా.

మనీషా కొయిరాలా

మనీషా కొయిరాలా

ఓ తరం వెనుక బాలీవుడ్ భామల్లో మనీషా కొయిరాలా రేంజ్ వేరుగా ఉండేది. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి అక్కడి బ్యూటీస్ సంకోచించే రోజుల్లోనే.. సౌత్ సినిమాలతో సెన్సేషన్స్ సృష్టించేసింది. బోంబాయి.. ఒకే ఒక్కడు.. భారతీయుడు లాంటి ఈమె బ్లాక్ బస్టర్స్ లో ఎక్కువ వాటా సౌత్ సినిమాలదే.

సమ్రాట్ దహల్

సమ్రాట్ దహల్

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో 2010లో సమ్రాట్ దహల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని.. రెండేళ్లకే విడాకులు ఇచ్చేసింది. అప్పుడే ఆమె అండాశయ క్యాన్సర్ తో బాధ పడుతోందనే విషయం బైటపడింది.క్యాన్సర్‌ బారిన పడ్డ మనీషా కొయిరాలా, వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్ళొచ్చింది.

ఇది నాకు నిజంగా పునర్జన్మ

ఇది నాకు నిజంగా పునర్జన్మ

ఇప్పుడు పూర్తిగా తాను కోలుకున్నానని స్వయంగా మనీషా వెల్లడించింది. ‘ఇది నాకు నిజంగా పునర్జన్మ.. నేను కోలుకోవాలని పూజలు చేసిన అభిమానులకు జీవితాంతం రుణపడి వుంటాను..' అంటూ ఉద్వేగంగా మాట్లాడింది మనీషా కొయిరాలా. సినీ రంగంలో తారగా ఎంత వెలుగు వెలిగినా.. క్యాన్సర్‌ బారిన పడ్డాక అతి కొద్ది మాత్రమే తనకు అండగా నిలిచారని వాపోయింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకిన్ అడుగు పెట్టింది.

పూర్తిగా లుక్ మార్చేసింది

పూర్తిగా లుక్ మార్చేసింది

ఇప్పుడు "డియర్ మాయ" అనే బాలీవుడ్ సినిమా కోసం పూర్తిగా లుక్ మార్చేసింది మనీషా. ఇందులో ఆమె వయసుమళ్లిన మహిళ పాత్ర పోషిస్తోంది. మామూలుగానే మనీషాలో గ్లామర్ టచ్ పోగా.. ఈ సినిమా కోసం ఆమెను మరింత డీగ్లామరైజ్డ్ గా చూపిస్తున్నారు. మనీషాను ఇలా చూడటం ఆమె అభిమానులకు రుచించని విషయమే. సునయన భట్నాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. ఇదొక స్ఫూర్తిదాయ కథాంశంతో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అంటున్నారు.

వయసు మళ్లిన పాత్రల్లో

క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్న మనీషా.. సెకండ్ ఇన్నింగ్స్ లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటోంది. వయసు మళ్లిన పాత్రల్లో నటించడానికి ఆమె సంకోచించట్లేదు. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో మనీషా.. సంజూ తల్లి నర్గీస్ దత్ పాత్ర పోషిస్తుండటం విశేషం.

English summary
Dear Maya Teaser Reveals Manisha Koirala’s Drastic Look Transformation For Her Role
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu