»   » కాపీ వివాదంలో స్టార్ హీరో సినిమా, లీగల్ నోటీసులు, నిజమే అయితే పరువు పోయినట్లే

కాపీ వివాదంలో స్టార్ హీరో సినిమా, లీగల్ నోటీసులు, నిజమే అయితే పరువు పోయినట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా పరిశ్రమ ప్రారంభమైన నాటి నుంచీ కాపి వివాదాలు అడపా దడపా వినపడుతూనే ఉన్నాయి. అయితే గ్లోబలైజేషన్ నేపధ్యంలో ఓ స్టార్ సినిమా రిలీజైందంటే అది ప్రపంచంలో సినిమా లవర్స్ అందరికీ తెలిసిపోతోంది. అంతేకాదు...ఆ సినిమా ఫలానా సినిమాలో సీన్స్ లేపారని సోషల్ మీడియాలో సైతం పోస్ట్ లు పెట్టేస్తున్నారు. దాంతో ఆ ఒరిజనల్ సినిమా తీసిన వాళ్లకు అవి తెలిసిపోవటం, వాళ్లు లీగల్ నోటీసులు పంపటం క్షణాల్లో జరిగిపోతోంది. ఇప్పుడు అదే సమస్య షారూఖ్ ఖాన్ సినిమాకు వచ్చింది.

రీసెంట్ గా రిలీజ్ అయిన షారుక్ ఖాన్- ఆలియా భట్ ల చిత్రం 'డియర్ జిందగీ' మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. షారూక్ స్పెషల్ రోల్ చేయగా.. ఆలియా నటన ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణ. ఇప్పుడీ చిత్రం కాపీరైట్ వివాదంలో ఇరుక్కోవడమే కాదు.. ఇప్పటికే నోటీసులు కూడా అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

కెనడియన్ మూవీ ' బీయింగ్ ఎరికా' కు డియర్ జిందగీ కాపీ అనే మాట ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచి వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ ఆరోపణలు ఎక్కువయ్యాయి కూడా. అంతేకాకుండా బీయింగ్ ఎరికా మేకర్స్ నుంచి నోటీసులు కూడా వచ్చినట్లు బాలీవుడ్ మేకర్స్ చెప్పుకుంటున్నారు కానీ.. నిర్మాతలు ధర్మ ప్రొడక్షన్స్ వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి.

Dear Zindagi copied from Canadian TV series Being Erica?

ఇక డియర్ జిందగీ చిత్రం ....బీయింగ్ ఎరికా నుంచి ఇన్ స్పైర్ అయిన విషయాన్ని దర్శకురాలు గౌరి షిండే ఖండిస్తున్నారు. ఇది కేవలం తాను రాసుకున్న స్క్రిప్ట్ మాత్రమే అని చెబుతున్నారు. అయితే అందరూ దొరికిపోయేక చెప్పే మాటలు ఇవే అనేది నిజం కదా.

'డియర్‌ జిందగీ' చిత్రాన్ని. ఆ 50 ఏళ్ల సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌....ఈయనకు జోడీగా 23ఏళ్ల అలియాభట్‌ హీరోయిన్ గా చేసింది. మొదటి చిత్రం 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'తో తన సత్తాను చాటుకుంది దర్శకురాలు గౌరీ షిండే. ఆ సినిమాలో శ్రీదేవిని గొప్పగా ఆవిష్కరించి బాలీవుడ్‌ని ఆకర్షించింది. రెండో చిత్రంపైనా అటువంటి ఫోకసే పెట్టింది. అందుకే మనసులను తాకే చిత్రం తీశారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 'డియర్‌ జిందగి' అని టైటిల్‌ పెట్టినట్టే కథనూ నడిపించారు.

హృదయానికి హత్తుకునేలా జహంగీర్‌ ఖాన్‌ పాత్రలో షారుఖ్‌ మెప్పించాడు. కైరాగా ఆలియా భట్‌ భలే చేసిందని ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో జీవితానికి సంబంధించిన దర్పణం లాంటి సన్నివేశాలు చాలానే ఉంటాయి. అందుకే అంతలా ప్రేక్షకాదరణ లభిస్తుందనిపిస్తుంది.

చిత్రం కథేంటంటే....కైరా (ఆలియా భట్‌) నేటి తరం యువతి. సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంటుంది. కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలని జీవితాన్ని సుఖంగా గడపాలని కలలు కంటుంటుంది. కానీ ఆమెకున్న భయాలతో అనుకున్నవి సాధించలేకపోతుంది. అందుకే తనకున్న భయాలను అధిగమించే ప్రయత్నంలో జహంగీర్‌ఖాన్‌ (షారుక్‌ఖాన్‌)ని కలుస్తుంది.

అతని పరిచయంతో కైరాకు ఓ కొత్త ప్రపంచం పరిచయమవుతుంది. అప్పటివరకూ ప్రేమ.. కెరీర్‌.. డబ్బు ఇలా ఎన్నో విషయాల్లో ఆమెకున్న సందేహాలన్నింటికీ జగ్‌ దగ్గర సమాధానాలు దొరుకుతాయి. అసలైన జీవితమంటే ఏంటో కైరాకు బోధపడుతుంది. ఈ క్రమంలో కైరా.. జగ్‌ల మధ్య అల్లుకున్న బంధం ఎలాంటిది? కైరా తన భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్లు వసూలు చేసింది. అందులో ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు వల్ల సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు భయపడిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లోనూ భారీగా కాసులు కురిపిస్తుంది 'డియర్‌ జిందగి'. ఈ చిత్రం ఈనెల 25న విడుదలైంది.

మొదటి రోజే దేశ వ్యాప్తంగా రూ. 12.15 కోట్లు వసూలు చేసిందట. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర అమెరికా రూ.1.58 కోట్లు, ఆస్ట్రేలియా రూ. 0.26 కోట్లు, న్యూజలాండ్‌ రూ. 0.09 కోట్లు, మొత్తంగా రూ. 14.08 కోట్లు బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించిందని బాలీవుడ్‌ వర్గాలు లెక్క గట్టాయి.

English summary
Dear Zindagi has been faring well at the box office and viewers are appreciating the film for its content and a brilliant performance by the lead actors, Shah Rukh Khan and Alia Bhatt. But, what's troubling is that the rumours of Gauri Shinde taking the plot of Dear Zindagi from Canadian TV series Being Erica have been doing the rounds.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu