»   » చంపేస్తాం: త్రిషకు కాబోయే భర్తకు బెదిరింపులు

చంపేస్తాం: త్రిషకు కాబోయే భర్తకు బెదిరింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిష త్వరలో వరుణ్ మణియన్ అనే వ్యాపారిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరికి గ్రాండ్‌గా నిశ్చితార్థం కూడా జరిగింది. జనవరి 23న చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ పార్టీలో ఛార్మీ, మాధవన్, ధనుష్, శింబు, ఆర్య, సంగీత దర్శకుడు అనిరుధ్, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారు పాల్గొన్నారు.

అంతా సవ్యంగా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని ఆందోళన మొదలైంది. అందుకు కారణం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వరుణ్ మణియన్‌ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడటమే. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనికి ఫోన్ చేసి బెదిరించారని, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టీంకు దూరంగా ఉండాలి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు వరుణ్ మణియన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Death Threats for Varun Manian

బీసీసీఐ మాజీ చీఫ్‌ శ్రీనివాసన్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రికెట్‌ టీం (సీఎస్‌కే)ను నటి త్రిషకు కాబోయే భర్త వరుణ్‌మణియన్‌ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ట్విట్టర్ సాక్షిగా కొట్టిపారవేశారు. తాను 20-20 క్రికెట్‌ టీం కొంటున్నట్లు వచ్చిన వార్తలపై వరుణ్‌ ట్విట్టర్ లో స్పందించారు.

వరుణ్ ట్వీట్ చేస్తూ.... ‘ఇపుడే నిశ్చితార్ధం జరిగింది, త్రిష నేను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం, ఏ టీం కొనే ఆలోచన లేదు, కాస్త ఏకాంతంగా వదిలేయండి' అని ట్వీట్‌ చేశారు. ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ వివాదంలో కూరుకున్న శ్రీనివాసన్‌ బీసీసీఐ అధికారిగా ఉంటూ, స్వంత క్రికెట్‌ టీం కలిగి ఉండడంపై సుప్రీంకోర్టు ఇటీవల విస్మయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బీసీసీఐ పదవికి అడ్డురాకుండా ఉండే విధంగా సీఎస్‌కె టీంను దగ్గరి వ్యక్తులకు అప్పగిస్తారనీ, ఇందుకు సమీప బంధువైన వరణ్‌ మణియన్‌ కూడా ఆసక్తి చూపాడని వార్తలు వెలువడ్డాయి. దీనిపై వరుణ్‌ అటువంటిదేమీ లేదని వివరణ ఇవ్వడంతో వచ్చే 16న జరుగనున్న ఐపీఎల్‌ వేలం నాటికి శ్రీనివాసన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోనని క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

English summary
Actress Trisha's husband-to-be and businessman-film producer Varun Manian is said to be receiving "death threats" from miscreants. Apparently, Varun has been getting calls from unidentified people asking him to stay out of IPL team CSK (Chennai Super Kings).
Please Wait while comments are loading...