డాడీ లెటర్: దీపిక పదుకోన్ కంటతడి (వీడియో)
హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం జరిగిన బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో దీపిక పదుకోన్ ‘పికు' చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీపిక తన తండ్రి రాసిన లెటర్ చదువూతూ ఎమోషనల్ అయ్యారు. ఆ అవార్డును తమ పేరెంట్స్ కు అంకితం ఇస్తున్నట్లు దీపిక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపిక చదివిన లెటర్లో ఏముంది? అనేది వీడియోలో చూడండి.
Deepika Padukone was left with teary eyes when she read the heart warming letter written to her by her father! Watch what happened in the biggest award show, #FilmfareOnSony, 7th Feb at 7 pm #ThankYouParents
Posted by Sony Entertainment Television on Thursday, February 4, 2016
హాలీవుడ్ మూవీలో దీపిక...
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఆమె తొలి హాలీవుడ్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేం విన్ డీసెల్‌తో కలిసి దీపిక నటించబోతోంది.
గతంలో అతనితో దిగిన ఫొటోను షేర్ చేసిన దీపిక... కొన్ని రోజుల క్రితం ‘xxx' మూవీలో తాను హీరోయిన్ గా ఖరారైనట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికారి కంగా ప్రకటించేవరకు దీపిక ఈ సీక్రెట్‌ను చెప్పలేదు. అటు నుండి అఫీషియల్ ప్రకటన రావడంతో దీపిక పదుకోన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
"హాలీవుడ్ ఎంట్రీపై నాకు ఎంతో ఉత్సాహంగానూ... టెన్షన్‌గానూ ఉంది. వచ్చేవారమే నా తొలి హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం వెళ్లబోతున్నా"అని దీపిక చెప్పింది. మొదట డొమినికన్ రిపబ్లిక్‌లో ‘xxx' మూవీ షూటింగ్ జరుగనుంది.
ఈ మూవీ కోసం దీపికా పదుకునే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో విన్ డీజిల్ కు పోటీగా నటించేందుకు దీపికా ఎంతోకష్టపడి శిక్షణ తీసుకుంటోంది. దీపికాపదుకునే కి ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తున్న యాస్మిన్ కరాచీవాలా శిక్షణకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











