»   »  వీడియో : స్టార్ హీరోయిన్స్ పోటాపోటీ డాన్స్

వీడియో : స్టార్ హీరోయిన్స్ పోటాపోటీ డాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : మరాఠా యోధుడు బాజీరావ్‌ పీష్వా జీవితం ఆధారంగా సంజయ్‌ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రంలో పింగా అనే పాటకు దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా పోటాపోటీగా డాన్స్ చేశారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కాశీ బాయిగా, దీపికా పదుకొణె మస్తానీగా నటిస్తున్నారు. వీరిద్దరు కలిసి డాన్స్ చేసిన పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియోనే ఇప్పుడు బాలీవుడ్ లో అందరి నోటా నలుగుతోంది. మీరూ ఈ వీడియో చూసి మీ ఆలోచనలను క్రింద కామెంట్ల కాలంలో పంచుకోండి.

2002లో బన్సాలీ దర్శకత్వం వహించిన 'దేవదాస్‌' చిత్రంలో అప్పటి స్టార్ హీరోయిన్స్ మాధురి దీక్షిత్‌, ఐశ్వర్యా రాయ్‌లతో చిత్రీకరించిన డోలారే పాట పెద్ద హిట్టైంది. బాజీరావ్‌ మస్తానీలో పింగా పాట కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు.

 Deepika Padukone, Priyanka Chopra Official Video Song

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. భారీ యుద్ధ సన్నివేశాలతో ఉన్న చిత్ర ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘ఈరోస్' సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ'పై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఈ పాటతో సినిమాపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.

English summary
Watch as Kashibai welcomes the warrior empress Mastani in a spectacular night of dance and celebration. Enjoy the new song from Bajirao Mastani ‘Pinga’ featuring Deepika Padukone and Priyanka Chopra.
Please Wait while comments are loading...