twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాట్సాప్‌ వాడుతున్నారా జాగ్రత్త.. డ్రగ్ కేసులో రకుల్, దీపిక, సారా, శ్రద్దా బుక్ అయ్యారిలా..

    |

    సోషల్ మీడియా చాటింగ్ యాప్ వాట్సాప్ ద్వారానే బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ బాగోతమంతా బయటపడటం సంచలనంగా మారింది. వ్యక్తిగత వాట్సాప్‌లు ఎలా బయటపడ్డాయనే విషయంపై చర్చ జరుగుతున్నది. బాలీవుడ్ ప్రముఖుల వాట్సాప్ ఛాటింగ్ ద్వారానే వారి డ్రగ్స్ సంబంధాలను పసిగట్టామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్న నేపథ్యంలో వాట్సాప్ సంచలన ప్రకటన చేసింది. వాట్సాప్ చేసిన ఆ ప్రకటన ప్రకారం..

    వాట్సాప్ ఛాట్ సేకరించే అవకాశం మూడో వ్యక్తికి ఉందా?

    వాట్సాప్ ఛాట్ సేకరించే అవకాశం మూడో వ్యక్తికి ఉందా?

    వ్యక్తులు గానీ, సంస్థలు, మరెవరైనా ఉపయోగించే వాట్సాప్ అత్యంత సురక్షితం. మూడో వ్యక్తి దానిని ఉపయోగించడం గానీ, ఆ సమాచారం సేకరించడానికి వీలులేదు అని వాట్సప్ నిర్వాహకులు స్పష్టం చేశారు. వాట్సాప్ వినియోగదారుల గోప్యత, సమాచార భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని సంస్థ పేర్కొన్నది. అయితే సినీ తారల వాట్సప్ ఎన్సీబీ అధికారులు ఎలా సంపాదించారనే విషయం మళ్లీ చర్చకు వచ్చింది.

    బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్‌లో వాట్సాప్ లీకులు ఇలా

    బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్‌లో వాట్సాప్ లీకులు ఇలా

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ జయ సాహా వాట్సాప్ ఛాట్‌ ఆధారంగానే బాలీవుడ్‌లో డ్రగ్స్ సంబంధాలను బట్టబయలు చేశారు. ఈ కేసులో ఆమె ఛాటింగ్ ద్వారానే విచారణకు కావాలని రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్, దీపిక పదుకోన్, శ్రద్ధాకపూర్‌కు సమన్లు జారీ చేశారు. అయితే జయా సాహా ఛాటింగ్‌ను సంపాదించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీని ఎన్సీబీ వాడినట్టు స్పష్టమైంది.

    వాట్సాప్ ఛాట్‌ను ఇలా సేకరించవచ్చు

    వాట్సాప్ ఛాట్‌ను ఇలా సేకరించవచ్చు

    సాధారణంగా వాట్సప్ వినియోగదారులు తమ ఛాటింగ్ బ్యాకప్‌ను ఎన్క్రిప్ట్ కాకుండా గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో నిక్షిప్తం చేసుకొంటారు. అలాంటి సమాచారాన్ని పాస్‌వర్డ్ లేకుండా మొబైల్ ఫోన్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సమాచారాన్ని వాట్సప్ నుంచి సేకరించే అవకాశం ఉంటుందని మొబైల్ టెక్నాలజీ నిపుణులు వెల్లడించారు.

    మొబైల్ క్లోనింగ్‌తో సాధ్యమే అంటూ

    మొబైల్ క్లోనింగ్‌తో సాధ్యమే అంటూ

    మొబైల్ ఫోన్‌ను ఇంటర్నేషనల్ మొబైల్ స్టేషన్ ఇక్విప్‌మెంట్ ఐడెంటి (ఐఎంఈఐ) నంబర్ ద్వారా మొబైల్ క్లోనింగ్‌తో చేయవచ్చని, దాంతో మూడో వ్యక్తి ఇతరుల వాట్సప్ ఛాట్‌ను సేకరించడానికి సులభమవుతుందనే విషయాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి వాట్సప్ సందేశాలను, విలువైన సమాచారాన్ని గూగుల్ డ్రైవ్, లేదా ఐక్లౌడ్‌లో నిక్షిప్తం చేసుకొనే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    వాట్సాప్ ఛాట్ యాక్సెస్ చట్టవ్యతిరేకం

    వాట్సాప్ ఛాట్ యాక్సెస్ చట్టవ్యతిరేకం

    అయితే వాట్సాప్ ఛాటింగ్‌ను ఇతరులు యాక్సెస్ చేయడం అంత సులభం కాదు. పైగా అలా చేయడం చట్టవ్యతిరేకం. కానీ ఏదైనా విచారణ, దర్యాప్తు సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు గానీ, దర్యాప్తు సంస్థలు గానీ ఇలాంటి పద్దతులను ఉపయోగించి చట్టబద్దంగా వ్యక్తుల వాట్సాప్ ఛాట్‌ను సంపాదించవచ్చు. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ తారల వాట్సప్‌ ఛాట్‌ను ఎన్సీబీ అధికారులు సంపాదించి ఉంటారనేది నిపుణుల అభిప్రాయం.

    English summary
    Deepika Padukone, Rakul Preet Singh in Drug case: Many movie celebrities whats leaks become sensation in the Bollywood drug rocket case. Mobile whatsapp chats are accessed thru International Mobile Station Equipment Identity (IMEI) number system.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X