»   » హీరోకు ఆపరేషన్..ఆమె సీక్రెట్ గా అక్కడే

హీరోకు ఆపరేషన్..ఆమె సీక్రెట్ గా అక్కడే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ భుజానికి ఇటీవల ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆస్పత్రిలో తన పరిస్థితిని రణ్‌వీర్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకున్నాడు. కానీ రణ్‌వీర్‌ ఓ విషయం దాచాడు అంటోంది బాలీవుడ్‌. శస్త్రచికిత్స జరిగిన రోజు రాత్రి 9 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం రణ్‌వీర్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేవరకు దీపికా పదుకొణె రణ్‌వీర్‌ పక్కనే ఉందట.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆదివారం సాయంత్రం ఎవరి కంటా పడకుండా ఆస్పత్రి వెనుక నుంచి వెళ్లిపోయిందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంలో రణ్‌వీర్‌ కానీ, దీపికా కానీ స్పందించలేదు. రెండేళ్ల క్రితం డెంగ్యూతో బాధపడుతూ రణ్‌వీర్‌ ఆస్పత్రిలో చేరితే అప్పుడూ దీపిక అక్కడే ఉండి సపర్యలు చేసిన విషయం తెలిసిందే.

Deepika Padukone stayed by Ranveer Singh’s side at the hospital

రణ్‌వీర్ సింగ్ గాయం పాలయ్యారు. ప్రసిద్ధ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న చారిత్రక కథా చిత్రం 'బాజీరావు మస్తానీ' షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. జైపూర్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతుండగా గుర్రం మీద నుంచి రణ్‌వీర్ సింగ్ కిందపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అదృష్టవశాత్తూ, ఆయనకు ఎముకలు విరగడం లాంటివేమీ జరగలేదు. షూటింగ్‌లలో గాయపడడం రణ్‌వీర్‌కు కొత్త ఏమీ కాదు. గతంలో కూడా 'లూటేరా' షూటింగ్ సమయంలో రణ్‌వీర్‌కు వీపు భాగంలో తీవ్రమైన గాయమైంది. అలాగే, 'గుండే' షూటింగ్‌లో ఆయన చేతికీ, చెంపకూ గాయాలయ్యాయి.

తాజా ప్రమాదం గురించి వ్యాఖ్యానిస్తూ, ''బడీ బడీ ఫిల్మోం మే ఐసీ ఛోటీ ఛోటీ బాతేం హోతీ రహతీ హై'' (పెద్ద పెద్ద సినిమాల్లో ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతుంటాయి) అని రణ్‌వీర్ హిందీ హీరోల విలక్షణ శైలిలో వ్యాఖ్యానించారు.

English summary
Deepika Padukone arrived at the hospital on Saturday night and kept watch over Ranveer through the night. Ranveer was discharged on Sunday afternoon, and exited the hospital via the front, posing for the paparazzi on his way out. But girlfriend Deepika, on the other hand, made a quiet slip-out from the back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu