కోనసీమలో అందని పవన్ కళ్యాణ్ కొమరం పులి బాక్స్ లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులికి తెలంగాణలో ఒక విధమైన ఆటంకాలు ఏర్పడుతుంటే, కోనసీమలో మరో విధమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల కోరికను తీర్చేందుకు కొమరం పులి శుక్రవారం విడుదలైంది. అయితే కోనసీమలో ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. కోనసీమలోని 11 సెంటర్లలో సినిమా విడుదల కావాల్సి ఉండగా రాజమండ్రి, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ వంటి పెద్ద సెంటర్లలో మాత్రమే సినిమా ఆడుతోంది. మిగతా సెంటర్లకు బాక్స్ లు అందలేదు. దీంతో సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాక్స్ లు ఇప్పుడిప్పుడే వస్తాయని థియేటర్ల యజమానులు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











