»   » సినీ నటి స్విమ్మింగ్ పూల్‌లో యువకుడి శవం

సినీ నటి స్విమ్మింగ్ పూల్‌లో యువకుడి శవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ ప్రఖ్యాత నటి డెమీ మూర్ ఇంట్లోని ఈత కొలనులో ఓ యువకుడి మృతదేహం లభించింది. అతినిని 21 ఏళ్ళ ఎడెనిల్సన్ స్టీవెన్ వాల్లె గా గుర్తించారు. మృతుడిని ఎడెనిల్సన్ స్టీవెన్‌గా గుర్తించారు. పది పదిహేను నిమిషాల వెతుకులాట తర్వాత స్నేహితులు అతన్ని ఈత కొలనులో గుర్తించినట్లు తెలిసింది.

ఈ సంఘటన జరిగిన సమయంలో నటి మూర్ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న మూర్ దిగ్భ్రాంతికి గురయ్యారని సమచారం. ఇది ఊహించని విషాధం అన్నారు. తన మాజీ భర్తతో కలిసి మూర్ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. ఒకప్పుడు హాలీవుడ్‌లో అత్యంత పారితోషకం తీసుకున్న నటిగా మూర్ ఓ వెలుగు వెలిగింది.

Demi Moore reveals 'shock' at death of man, 21, found in her Beverly Hills pool

తన అసిస్టెంట్ ఇచ్చిన విందు సందర్భంగా ఏ మాత్రం ఊహించని పరిస్థితిలో ఈ ప్రమాదం సభంవించిన డెమీ మూర్ అన్నారు. యువకుడి మృతిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు లాస్ ఎంజెలెస్ పోలీసు శాఖ అధికారి చెప్పారు. అతనికి ఈత కొట్టడం రాదని, అకస్మాత్తుగా జారిపడి మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో డెమీ మూర్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఇంట్లో లేరు. డెమీ కూతుళ్లు రూమేర్, స్కౌట్, తలుల్లా న్యూయార్క్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
A 21-year-old man has been found dead in Demi Moore's swimming pool at her Los Angeles home after he accidentally drowned.
Please Wait while comments are loading...