»   » ఫుట్ పాత్ పై దయనీయ మృతి

ఫుట్ పాత్ పై దయనీయ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Demudu Chesina Manushulu
సిని ప్రొడక్షన్ మేనేజర్ మరియు నిర్మాత వాడ్రేవు సుబ్బారావు(80) హైదరాబాద్‌ చిక్కడపల్లి చందనబ్రదర్స్‌ ఫుట్‌పాత్‌పై ఆయన మృతిచెందారు.ఆయన మృతి చెంది వుండడాన్ని స్థానికులు గమనించి,రక్తసంబంధీకులు లేకపోవడంతో స్థానికులే దహన సంస్కారాలు నిర్వహించారు.చిక్కడపల్లిలో ఉండే బ్రాహ్మణుల సహకారంతో సుధాకర్‌ బన్సీలాల్‌పేట్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపించారు. ఎన్టీఆర్‌, సూపర్‌స్టార్‌ కృష్ణల కాంబినేషన్‌లో సూపర్‌డూపర్‌ హిట్టయిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాకు ఈయన ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించారు.ఆ తర్వాత కాలంలో లో బడ్జెట్ సినిమాలు నిర్మించారు. కాలక్రమంలో ఈయన ఆర్థికంగా చితికిపోయారు. ఎవరు నా అనే వారు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా చిక్కడపల్లి చందనబ్రదర్స్‌ ఫుట్‌పాత్‌పై జీవనం సాగించాడు. ఈయన నేపథ్యం తెలిసిన వారు అప్పుడప్పుడు సహాయం చేస్తుండేవారు. స్థానికుల సహకారంతో ఇంతకాలం ఆయన జీవనం సాగించాడు. ఎంతోమంది సినీ ప్రముఖులు ఉన్నా వృద్ధాప్యంలో కటిక దారిద్య్రం అనుభవించిన సుబ్బారావును ఆదుకోకపోవడం అంగపని ఆశ్చర్యానికి గురిచేసేది. సినీ వర్గాలకు సమాచారమందించినా చివరి చూపుకు కూడా ఎవరూ రాలేదు.అలాగే ఈ తరానికి చాలా మందికి ఆయన పరిచయమే లేరు.
English summary
Senior Production Manager and film Producer Vaadrevu Subba Rao Died.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu