»   » సినిమా టికెట్ దొరకలేదని అభిమాని ఆత్మహత్య

సినిమా టికెట్ దొరకలేదని అభిమాని ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా టికెట్ దొరకలేదని మనస్తాపం చెందిన అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. తన అభిమాన హీరో నటించిన సినిమా చూసేందుకు ధర్మేంద్ర కుష్వాహా అనే అభిమాని టిక్కెట్ తీసుకోవడం కోసం క్యూలో నిల్చున్నాడు.

Denied ticket for Salman film, man commits suicide

టికెట్ దొరకక పోవడంతో ధర్మేంద్ర థియేటర్ మేనేజర్‌తో ఘర్షణ పడ్డాడు. కొద్ది సేపటి తర్వాత ధర్మేంద్ర ఇంటికి సినిమా హాలు మేనేజర్, మరికొందరు వెళ్లి, ధర్మేంద్రను తీవ్రంగా కొట్టారని అతని సోదరుడు రాకేష్ చెప్పాడు. అవమానం భరించలేక ధర్మేంద్ర తన తల్లి చీరతో ఉరి వేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు.

ధర్మేంద్రను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించాడని డాక్టర్లు చెప్పారు. ఆత్మహత్య ఘటనపై ఆగ్రహించిన స్థానికులు సినిమా హాలుపై రాళ్లు విసిరారు. పోలీసులు సకాలంలో చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కేవలం సినిమా టికెట్ కోసం జరిగిన గొడవ చివరకు అభిమాని ప్రాణాలు బలితీసుకోవడం అందరినీ కలిచి వేసింది.

English summary
A man committed suicide after a scuffle with the manager at a cinema hall, Anup Talkies, after he was denied a ticket to Salman Khan-starrer Prem Ratan Dhan Payo on Thursday.
Please Wait while comments are loading...