'నాచోరే' అంటూ దేవిశ్రీప్రసాద్ పాట సాయం
హైదరాబాద్ : తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ గా సంచలనం సృష్టిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ కి మరోసారి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. గతంలో 'డింకచక... డింకచక...' అంటూ సల్మాన్ ఖాన్ చిత్రం 'రెడీ'కి జోష్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ చిత్ర విజయంలో ఈ పాట కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి దేవిశ్రీ... సల్మాన్ నటిస్తున్న 'జై హో' కోసం పాట సాయం చేశాడు.

ప్రస్తుతం మహేష్ ...1 నేనొక్కడినే చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ తెలుగులో మరో చిత్రం కమిటయ్యాడు. బన్నీ,దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ హిట్స్ చాలా ఉన్నాయి. వీరి కాంబినేషన్ అంటే యూత్ ని పట్టే పాటలుంటాయని అంచనాలు వేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ కూడా ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ తోనే జర్ని చేస్తున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, జులాయి,అత్తారింటికి దారేది చిత్రాలు మ్యూజికల్ గా ఘన విజయం సాధించాయి. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్,అల్లు అర్జున్ చిత్రానికి మరోసారి దేవిశ్రీప్రసాద్ తోనే ముందుకు వెళ్తున్నారు.


Click it and Unblock the Notifications











