twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదం: దేవిశ్రీ ప్రసాద్ వల్ల మనోళ్లు నష్టపోతున్నారా?!

    |

    హైదరాబాద్: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోల సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందిస్తూ ఫాంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దేవిశ్రీ ప్రసాద్ వ్యవహారం ఇపుడు వివాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సినీ మ్యూజీషియన్స్ యూనియన్‌లో మెంబర్ షిప్ తీసుకోవడానికి దేవిశ్రీ ప్రసాద్ నిరాకరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో యూనియన్ అతనిపై చర్య తీసుకునే యోచనలో ఉంది.

    దేవిశ్రీతో పాటు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లయిన తమన్, కోటి, కీరవాణి కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, యూనియన్ జనరల్ బాడీ మీటింగులో వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 2వ ఆదివారం ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయింది.

    Devi Sri Prasad

    వీరు తెలుగు సినిమాలకు పని చేస్తూ....తమిళనాడులో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, దీని వల్ల ఇక్కడి వారు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. వారు ఒకసారి ఏపీ యూనియన్లో మెంబర్ షిప్ తీసుకుంటే....రికార్డింగ్స్ హైదరాబాద్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఇతర విషయాల్లో కూడా ఏపీ మ్యూజీషియన్స్ యూనియన్లో సభ్యత్వం ఉండే వారి సేవలు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

    ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగుతో పాటు ఇతర బాషా చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఏపీ యూనియన్లో సభ్యత్వం తీసుకుంటే అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనే సందేహంలో పడ్డారు. ఈ కారణంగానే వారు సభ్యత్వం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా......యూనియన్ మెంబర్ షిప్ తీసుకుంటే తెలుగు వారికి ఎంతో కొంత మేలు జరుగుతుందనేది సత్యం. యూనియన్ వారు చేస్తున్న వాదనలోనూ న్యాయం ఉంది.

    English summary
    Music director Devi Sri Prasad's refusal to take membership of the AP Cine Musicians Union has angered the union, which is considering action against him. Four top music directors are on the 'hit list' of the union as they are dilly-dallying on taking membership of the union. The list includes Thaman, Koti and Keeravani, all of whom are much sought-after in the Telugu film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X