జబర్దస్త్ బ్యాచ్ కూడా ఉంది: ‘ధనలక్ష్మి తలుపు తడితే’(ట్రైలర్)

By Bojja Kumar

మనోజ్ నందం, ధన్‌రాజ్, శ్రీముఖి, సింధు తులాని, రణధీర్, ప్రధాన తారాగణంగా భీమవరం టాకీస్ పతాకంపై సాయి అచ్యుత చిన్నారి దర్శకత్వంలో తుమ్మల రామసత్యనారాయణ రూపొందించిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

నిర్మాతగా మారిన కమెడియన్ ధనరాజ్..లైఫ్ స్టోరీ
సినిమా గురించి నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, సినిమా కథ బాగా కుదరడంతో బడ్జెట్‌ను ముందుగానే నిర్ణయించుకుని పక్కా ప్రణాళికతో ఈ సినిమాను తీర్చిదిద్దామని, చిన్న సినిమాగా మొదలుపెట్టినా క్వాలిటీ విషయంలో పెద్ద చిత్రంగానే రూపొందిందని, దర్శకుడికి మొదటి చిత్రమైనా అనుభవమున్న వ్యక్తిలా చిత్రీకరించారని తెలిపారు.

ఈ దర్శకుడితో ‘సచ్చినోడి ప్రేమకథ' అనే చిత్రాన్ని మొదలుపెట్టినా, అనివార్య కారణాలవల్ల ఆ చిత్రాన్ని వదిలి ఈ చిత్రాన్ని చేశామని, కథ నచ్చి ఈ సినిమాకు భాగస్థుడిగా మారానని, కథే హీరోగా ఉంటుందని ధన్‌రాజ్ తెలిపారు. దర్శకుడు సాయి అచ్యుత్ చిన్నారి మాట్లాడుతూ, తొలిసినిమా అనుకోకుండా ఓ బాధ్యతతో రూపొందించానని, సినిమా చూసిన ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుందని, సంగీతం బాగుంటుందని తెలిపారు.

Dhanalakshmi Thalupu Thadithe Theatrical Trailer

అనీల్ కల్యాణ్, విజయ్‌సాయి, నాగబాబు, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:జి.శివకుమార్, ఎడిటింగ్:శివ వై.ప్రసాద్, నిర్మాత:తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సాయి అచ్యుత్ చిన్నారి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X