»   » కోర్టు మెట్లెక్కిన ధనుష్!

కోర్టు మెట్లెక్కిన ధనుష్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనపై దాఖలైన పిటిషన్ పై స్టే విధించాలంటూ తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు. తనపై దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ధనుష్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీ చోకలింగం విచారించారు.

అనంతరం పిటిషన్ దారులు కాథిరేశన్, మీనాక్షి దంపతులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 8 తేదీకి వాయిదా వేశారు.

Dhanush moves Madras High Court over couple’s claim

ఇటీవల ఓ దంపతులు ధనుష్ తమ కుమారుడని తమిళనాడులోని మేలూర్ కు సమీపంలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో సినిమాలపై మోజుతో చెన్నైకి పారిపోయాడని వారు ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా తమ సంతానంలో మూడో కుమారుడైన ధనుష్ జీవన భృతి కింద నెలకు రూ.65 వేలు చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

English summary
Popular actor Dhanush on Wednesday moved a Madras high court, seeking quashing of a case filed
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu