»   » టీవీ 9 ఇంటర్వ్యూ వివాదంపై హీరో ధనుష్ విచారం!

టీవీ 9 ఇంటర్వ్యూ వివాదంపై హీరో ధనుష్ విచారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ స్టార్ ధనుష్ ఇటీవల తెలుగు న్యూస్ ఛానల్ టీవీ 9 ఇంటర్వ్యూలో పాల్గొని మధ్యలోనే వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ వాకౌట్ చేసిన వీడియోను టీవీ 9న యూట్యూబ్‌లో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

'విఐపి-2' సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకు వస్తే తన పర్సనల్ లైఫ్ విషయాలను అడగటంతో నొచ్చుకున్న ధనుష్ 'స్టుపిడ్ ఇంటర్వ్యూ' అంటూ వాకౌట్ చేశాడు. అప్పడు కోపంలో అలా చేసిన ఈ తమిళస్టార్ ఇపుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.


నాది నాకే సిల్లీగా ఉంది

నాది నాకే సిల్లీగా ఉంది

టీవీ 9 ఇంటర్వ్యూలో అలా ప్రవర్తించడంపై ధనుష్ స్పందించారు. ఆ విషయం తలుచుకుంటే నాది నాకే చాలా సిల్లీగా అనిపిస్తుందని, నేను అపుడు అలా చేసి ఉండాల్సింది కాదు అని ధనుష్ చెప్పుకొచ్చారు.


Dhanush And Kajol Speech @ VIP 2 Team Press Meet
నేను చాలా కామ్ పర్సన్

నేను చాలా కామ్ పర్సన్

నేను చాలా కామ్ పర్సన్.... ఎప్పుడూ ఇలా ప్రవర్తించ లేదు. సినిమా ప్రమోషన్ కోసం వస్తే ఆ రోజు నా పర్సనల్ లైఫ్ విషయాలు అడగటంతో అనుకోకుండా కోపం వచ్చింది. నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని ధనుష్ వివరణ ఇచ్చుకున్నారు.


రెండు వారాల నుండి నిద్రలేదు, అందుకే...

రెండు వారాల నుండి నిద్రలేదు, అందుకే...

సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల రెండు వారాలుగా సరిగా నిద్రలేదు. అదే ఒత్తిడితో సినిమా ప్రమోషన్లకు వచ్చాను. నా నుండి అలాంటి రియక్షన్ రావడానికి నాలో ఉన్న ఒత్తిడి కూడా ఓ కారణమే అని ధనుష్ తెలిపారు.


ధనుష్ కోపానికి కారణం ఇదే...

ధనుష్ కోపానికి కారణం ఇదే...

విఐపి 2 మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన ధనుష్‌ను టాలీవుడ్ చిత్రసీమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు గురించి ప్రశ్నించారు టీవీ 9 యాంకర్. తనకు తెలియని విషయాలపై తాను స్పందించను అని ధనుష్ చెప్పడంతో... మీ పర్సనల్ లైఫ్‌లోకూడా చాలా వివాదాలు, ఆరోపణలు ఉన్నాయంటూ యాంకర్ ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన ధనుష్ ఇది స్టుపిడ్ ఇంటర్వ్యూ అంటూ మైక్ విసిరేసి ఫైర్ అయ్యారు.


విఐపి 2

విఐపి 2

ధనుష్, కాజోల్, అమలా పాల్ ముఖ్యపాత్రలు పోషించిన ‘విఐపి-2' చిత్రానికి సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన ‘రఘువరన్ బి టెక్' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.English summary
Dhanush recently walked out of the interview after the interviewer asked questions about his personal life. The video released by TV 9 Telugu was doing the rounds on the internet. Dhanush regrets walking out of TV interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu