»   » అలా చేయటం నిర్మాతకు మండింది...తమన్నాపై కేసు పెట్టాడు

అలా చేయటం నిర్మాతకు మండింది...తమన్నాపై కేసు పెట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న తమన్నా పై సినీ నిర్మాత ఒకరు కేసు పెట్టారు. ఈ విషయం అంతటా సంచలనంగా మారి చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే తమిళంలో శీను రామస్వామి దర్శకత్వంలో తమన్నా నటించిన 'ధర్మ దురై' చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

అయితే విడుదలకు ముందు గానీ, రిలీజ్ అయ్యాక కానీ తమన్నా సినిమాకి ప్రమోషన్లలో అస్సలు పాల్గొనలేదు. హీరో విజయ్ సేతుపతి మాత్రమే ప్రమోషన్లలో పాలగోన్నాడు. దీంతో నిర్మాత ఆర్కే సురేష్ కాస్త చాలా బాధపడ్డారు. ఇది ఆమె బాధ్యతా రాహిత్యమని మండిపడ్డాడు.

అయితే అలా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవటం తమన్నాపాలిసీనా అంటే ఆమె తాను తాజాగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'అభినేత్రి' కి మాత్రం తరచూ ప్రతి ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొంటోంది.

Dharma Durai producer lodges complaint against Tamannaah Bhatia

దీంతో ఆయనకు చాలా కోపం వచ్చింది. తను, తన సినిమా ని ఆమె తక్కువ చేసినట్లు ఫీలయ్యారు.దాంతో ఆ నిర్మాత తమిళనాడు నడిగర్ సంఘంలో తమన్నాపై తన సినిమాకి ప్రమోషన్ చేయలేదంటూ పిర్యాదు చేశాడు. అయితే విచారణ జరపాల్సిన నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్ తమన్నాతో కలిసి 'కత్తి సందై' చిత్రంలో నటిస్తున్నారు. దీంతో ఈ పిర్యాదు విచారం ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అజిత్ గానీ, నయనతారగానీ చిత్ర ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోమని చిత్రాలను అంగీకరించే ముందే సదరు దర్శక నిర్మాతలకు చెప్పేస్తారు. వారు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోయినా తప్పు పట్టరు. ఈ మధ్యనే త్రిష తాను నటించిన నాయకి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదనే ఆరోపణలను మూట కట్టుకున్నారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా అలాంటి నిందనే ఎదుర్కొంటోవటంతో ఈ విషయం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

English summary
A complaint has been filed against Tamannaah Bhatia with Chennai-based Nadigar Sangam, officially known as the South Indian Artistes' Association (SIAA). RK Suresh, the producer of Tamannaah's recently-released Tamil film Dharma Durai, has sought strict action for her "unprofessional behaviour."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu