»   » విక్రమ్ చేసిన ఆ చిత్రం అంటే ఇష్టమంటున్న అమీర్‌ఖాన్‌

విక్రమ్ చేసిన ఆ చిత్రం అంటే ఇష్టమంటున్న అమీర్‌ఖాన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ సినిమాలను ఎక్కువగా చూస్తుంటానని, అవకాశమొస్తే తమిళంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని అమీర్ ఖాన్ తెలిపారు. అలాగే తమిళ నటుడు విక్రమ్‌ తనకు మంచి మిత్రుడని, ఆయనతో ఎన్నో విషయాలను చర్చిస్తానని పేర్కొన్నారు. విక్రమ్‌ నటించిన సినిమాల్లో 'పితామగన్‌' (శివపుత్రుడు) తనకు ఎంతో ఇష్టమన్నారు.

అవకాశమొస్తే తమిళంలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌ స్పష్టం చేశారు. అభిషేక్‌బచ్చన్‌, కత్రినాకైఫ్‌లతో కలిసి ఆయన నటించిన చిత్రం 'ధూమ్‌-3'. ఈ చిత్ర ప్రచారం కోసం ఆయన మంగళవారం రాత్రి నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తల్లి ఏడేళ్ల పాటు చెన్నైలోనే ఉన్నారని, ప్రస్తుతం మదురైలో ఉంటున్నారని తెలిపారు. ఆమెను కలుసుకునేందుకు తాను తరుచుగా ఇక్కడకి వస్తానని, అలా తమిళనాడు తనకు ఎంతో పరిచయమైన ప్రాంతమన్నారు. ధూమ్‌-3 అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు.

Dhoom 3 as important as any of my own film: Aamir Khan

అభిషేక్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, ఉదయ్‌ చోప్రా కీలక పాత్రలు పోషించిన 'ధూమ్‌-3'ని విజయ్‌ కృష్ణ ఆచార్య రూపొందించారు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. . ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌‍ను పురస్కరించుకుని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


ఈచిత్రంలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ....కత్రినా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు. సినిమాలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి. ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకం. చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Bollywood superstar Aamir Khan said Tuesday that he treats all his films equally and his forthcoming release "Dhoom 3", which is coming out Friday, is as important as any of his own film from the past. "I think for me every film is important. All the films I do are equally important to me. I treat all my films equally and I really love my work. When I do a film I join the process which is as important to me as the outcome," Aamir told reporters here at a promotional event of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu